సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర కారు కలకలం సృష్టించింది. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి… మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు సమాచారం. దీంతో భయాందోళనలకు గురైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఏపీ 31ఏఎన్ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


























