నాగార్జున భార్య అమల ఒక ప్రముఖ యానిమల్ సంస్థకు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే..స్వతహాగా జంతు ప్రేమికురాలు అయిన అమల మనస్సు చాలా మంచిది అని అందరూ అంటుంటారు.ఆ మంచి మనసు చూసే హీరో నాగార్జున అమల తో ప్రేమలో పడ్డారని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.అయితే నాగార్జున అడిగిన ఒక ప్రొపోజల్ కు అమల చెప్పిన సమాధానం తెలిస్తే అమల మనస్తత్వం ఎంతో గొప్పదో తెలుస్తుంది..ఆ వివరాల్లోకి వెళ్తే …

మొదటగా తమిళ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు అమల.కాగా మొదటిసారిగా టాలీవుడ్ లో హీరో నాగార్జున తో “చిన్నబాబు” అనే చిత్రంలో కలిసి నటించారు అమల.ఈ చిత్ర షూటింగ్ లో ఏర్పడిన పరిచయమే వీరిద్దరి వివాహానికి కారణం అయింది.అయితే వీరికి పెళ్లి అయిన మొదటి సంవత్సరం తర్వాత అఖిల్ జన్మించాడు.ఆ తర్వాత నాగార్జున గారితో అమల మనకి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాగ చైతన్య కూడా మన కొడుకే కదా అన్నారంట. దాంతో నాగార్జున సంతోషించారంట. ఆ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అమల గారి గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్






















