ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని… అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మగవాళ్ళు మీరు కూడా అలానే అనుకుంటున్నారా..? వయసు కనపడిపోతోంది అని తెగ బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ ఆహార పదార్థాలు తీసుకోండి వీటిని డైట్ లో తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది పైగా మీరు ఎక్కువ వయసు లాగ కనపడరు.
మరి ఇక ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బాగుంటుంది..? ఎలా వయసుని చూడడానికి తగ్గించుకోవచ్చు అనే విషయాలని చూసేద్దాం. ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన చిట్కాలు అని చెప్పారు వీటిని అనుసరిస్తే సరిపోతుంది.
#1. పసుపు:
పూర్వకాలం నుండి పసుపుని వంటల్లో వాడుతూనే ఉన్నాము పసుపును తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెల్ డ్యామేజ్ ని కూడా నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
#2. గ్రీన్ టీ:
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు బాగా అధికంగా ఉంటాయి. సెల్ డామేజ్ ని నివారిస్తుంది. చూడడానికి మీ వయసు తక్కువగా కనపడాలంటే మీరు గ్రీన్ టీ ని కూడా తీసుకోండి.
#3. బెర్రీస్:
ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడతాయి. సెల్ డామేజ్ ను నివారిస్తాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెర్రీస్ తో వృద్ధాప్యం త్వరగా రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు.
#4. నట్స్:
నట్స్ ని కూడా తీసుకోండి. నట్స్ ని తీసుకోవడం వలన గుండెజబ్బులు రావు అలానే మీ వయసు తక్కువగా కనబడుతుంది. బాదం, జీడిపప్పు మొదలైనవి తీసుకుంటూ వుండండి.
#5. సాల్మన్:
సాల్మన్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గుండె జబ్బులు కూడా రావు. అలానే మీ వయసు తక్కువగా కనబడుతుంది.
#6. ఆకుకూరలు:
ఆకుకూరల్లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇమ్యూనిటీని కూడా ఇవి పెంచుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీ వయసు తక్కువగా కనపడాలంటే ఆకుకూరలను కూడా తీసుకుంటూ ఉండండి.
#7. పెరుగు:
పెరుగు లోపల ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది పెరుగు ని తీసుకుంటే మీ వయస్సు తక్కువగా కనబడుతుంది.
#8. డార్క్ చాక్లెట్:
ఇది కూడా మీ వయసు తక్కువగా కనబడటానికి సహాయపడుతుంది. సో దీనిని కూడా మీరు తీసుకోవచ్చు.