చాలామంది ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు తప్పులను చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం పూట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాళీ కడుపుతో మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు లేదంటే ఇతర సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

Video Advertisement

మారిన ఆహారపు అలవాట్ల వలన ప్రస్తుతం చాలామంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ఈ ఆహారం తీసుకుంటే గ్యాస్టిక్ సమస్య డబల్ అవుతుంది జాగ్రత్తగా వుండండి. ఉదయం పూట ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదనేది ఇప్పుడు చూద్దాం.

Good food

#1. టీ:

చాలా మంది లేస్తునే టీ తాగుతూ ఉంటారు. మనసుని ఇది రిఫ్రెష్ గా మారుస్తుంది కానీ కాళీ కడుపుతో టీ తీసుకుంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్యాస్ట్రిక్, డిహైడ్రేషన్ మొదలైన సమస్యలు వస్తాయి.

#2. కాఫీ:

కాఫీ కూడా ఉదయాన్నే కాళీ కడుపుతో తీసుకోకూడదు. దీని వలన కూడా గ్యాస్టిక్ సమస్య రావచ్చు. కాబట్టి కాఫీ, టీ తీసుకునే వాళ్ళు లేచిన తర్వాత నీళ్లు తాగిన తర్వాత టీ కాఫీలను తీసుకోవడం మంచిది.

#3. పచ్చి కూరగాయలు:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కూరగాయలను కూడా తీసుకోకూడదు. వీటివల్ల జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంది.

cool drinks 2

#4. కూల్ డ్రింక్స్:

ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ ని తీసుకోవడం వలన అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి జీర్ణ వ్యవస్థ పై కూడా చెడు ప్రభావం పడుతుంది.

#5. స్పైసీగా ఉండే ఆహారం:

స్పైసీగా ఉండే ఆహారం కూడా కాళీ కడుపుతో తీసుకోవద్దు ఇది కూడా ఎసిడిటీకి దారి తీస్తుంది.

fruits 2

#6. సిట్రస్ ఫ్రూట్స్:

కాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఎక్కువ ఆమ్లం ప్రొడ్యూస్ అవుతుంది ఇది గ్యాస్టిక్ సమస్యకు దారితీస్తుంది.