అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్.. కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేశాక మరుసటి బంతికే రాహుల్ ఔటయ్యాడు.
అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య వేగంగా ఆడగా.. కోహ్లి నిలకడగా పరుగులు రాబట్టాడు. విరాట్ కోహ్లి ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ శతకం నమోదు చేశాడు.
వేగంగా ఆడిన సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఆఖర్లో దూకుడుగా ఆడిన అశ్విన్ 6 బంతుల్లో 13 రన్స్ తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే చీటింగ్ చేసి గెలిచారు అంటూ పాక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ వర్షం తగ్గినా తరవాత మ్యాచ్ మొదలు పెట్టడం గురించి మాట్లాడాడు. అంపైర్ల తీరు మీద షకీబుల్ అసహనం వ్యక్తం చేసాడని అన్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్.
బాబర్ ఆజమ్ అంపైర్లతో నో బాల్ గురించి ఓ ఫొటోను షేర్ చేసి చీటింగ్ చేసారని అంటున్నారు. వర్షం తర్వాత బ్యాటింగ్ చేయడం కంటే కూడా బౌలింగ్, ఫీల్డింగ్ చేయడం కష్టం అయినా టీమిండియాను టార్గెట్ చేస్తున్నారు. వైడ్ ఇవ్వాలని కోహ్లీ అంపైర్‌ను అడగడాన్ని కూడా తప్పుగా భావిస్తున్నారు. ఇలా పాక్ అనడం వెనుక కారణం బంగ్లాదేశ్ పై ప్రేమ కాదు ఇండియా విన్ అయితే సెమీస్ అవకాశాలు కోల్పోతారని. 39 బంతుల్లో 43 రన్స్ చేయలేని పాకిస్థాన్ కి సెమీస్ కి వెళ్లడం మీద ఆసక్తి ఎందుకని భారత అభిమానులు అంటున్నారు.