చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు.
ఆ మార్పులు కూడా చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. కమర్షియల్ హీరో పాత్రకి భిన్నంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఉంటుంది. అయినా సరే ప్రేక్షకులు నిరాశ పడకుండా ఉండేలాగా ఎలివేషన్స్, డైలాగ్స్ బలంగా ఉండేలా చూశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ చాలా బాగుంది అని అంటున్నారు. అలానే ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలపై చర్చ జరుగుతోంది.
తాజాగా మా సినిమాని B-గ్రేడ్ మసాలా సినిమా లాగా చేసేసారు అంటూ ఫైర్ అవుతున్నారు మలయాళీలు. ఐటం సాంగ్, తుపాకీలతో సినిమాని B-గ్రేడ్ మసాలా సినిమా లాగా చేసేసారు అంటున్నారు. అలానే ఈ సినిమాలో ఎక్కువగా మాస్ మూమెంట్స్ ఉన్నాయని.. ఒరిజినల్ లో అవి తక్కువగా ఉన్నాయని అంటున్నారు. స్క్రిప్ట్ ని అర్ధం చేసుకోలేదని కూడా అన్నారు.
ట్రక్ బ్లాస్ట్ సన్నివేశాలు అయితే లూసిఫర్ ఫ్యాన్స్ కి కామెడీ స్పూఫ్ గా అనిపిస్తాయంటున్నారు. ఇలా వేరు వేరు ఆడియన్స్ ని పోల్చకూడదు కానీ మణిచిత్రతాఝుని చూసినప్పుడు చంద్రముఖిని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? ఇక్కడ కూడా అలానే జరిగిందని అంటున్నారు. ఒరిజినల్ చూసిన వాళ్ళని ఈ చిత్రానికి దూరంగా ఉండండి అని మలయాళీలు అంటున్నారు.