సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు.
అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి, పిల్లలు కూడా ఒకటి. మన సెలబ్రిటీలలో కొంత మందికి కవల పిల్లలు ఉన్నారు. తాజాగా నయనతార దంపతులు కవలలకు జన్మనిచ్చారు.
సోషల్ మీడియా వేదికగా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించారు. నయనతార భర్త, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టినట్టు చెప్పారు. వీరి పెళ్లి కొన్ని నెలల క్రితం జరిగింది. అయితే అద్దెగర్భం పద్ధతిలో వీరు తల్లిదండ్రులు అయినట్టు వార్తలు వస్తున్నాయి. నయనతార అద్దె గర్భంతో తల్లి అవ్వడం నేరమా న్యాయమా..?
సరోగసి నియమాలు:
#1. సరోగసి ద్వారా పిల్లలను కోరుకుంటే.. వైద్య అధికారుల నుండి ఆ దంపతులు పెర్మిషన్ తీసుకోవాలి.
#2. అలానే ఆ దంపతులకి పిల్లలు వుండకూడదు. దత్తత తీసుకు ఉండకూడదు.
#3. సరోగసి ద్వారా కూడా పిల్లలు వుండకూడదు.
#4. ఒకవేళ కనుక పిల్లకి లేదా పిల్లాడికి మానసికంగా లేదా శారీరకంగా సమస్యలు వున్నా.. ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్నా సరోగసికి వెళ్ళచ్చు. 2021 చట్టం ప్రకారం తల్లి, తండ్రికి పెళ్లి అవ్వాలి. ఆ తల్లి వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆ తండ్రికి 26 నుంచి 55 ఏళ్ళు ఉండాలి.
వీళ్ళు సరోగసికి వెళ్లకూడదట:
#1. సహజీనవం చేస్తున్నవారు సరోగసి ద్వారా కనకూడదు.
#2. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఈ పద్దతిలో బిడ్డని కనడానికి కుదరదు.
సరోగసీ భారతదేశంలో చట్టపరమేనా.. ?
ఇప్పుడైతే ఈ బిల్లు, అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ (ART bill) మీద చర్చ సాగుతోంది. కమర్షియల్ సరోగసీను రద్దు చెయ్యాలనే ఆలోచనలో వుంది.
సరోగసీ ద్వారా బిడ్డకు జన్మించిన సెలెబ్రెటీలు:
ఈ పద్దతిలో కనడం సెలెబ్రెటీలకు కొత్తేమి కాదు. 2011లో ఆమిర్ ఖాన్, 2013లో షారుఖ్ ఖాన్, 2014లో మంచు లక్ష్మి, 2017లో కరణ్ జోహార్, 2022 లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఈ పద్దతిలోనే పిల్లల్ని కన్నారు. ఇప్పుడు నయనతార, విగ్నేష్ కూడా ఇదే పద్దతిలో కవలలను కన్నారు. మరి నయనతార అద్దె గర్భంతో తల్లి అవ్వడం నేరమా న్యాయమా..?