అంజీర్ ని రోజూ తింటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు వస్తాయట తెలుసా..?

అంజీర్ ని రోజూ తింటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు వస్తాయట తెలుసా..?

by Megha Varna

Ads

పండ్లని, డ్రై ఫ్రూట్స్ ని ప్రతి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అందుకనే చాలా మంది ప్రతి రోజు డైట్ లో పండ్లను, డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. అంజీర్ కూడా డ్రై ఫ్రూట్స్ లో ఒకటి చాలా మంది రెగ్యులర్ గా దీనిని తింటుంటారు.

Video Advertisement

అయితే అంజీర్ ని తీసుకోవడం వల్ల ఎలా అయితే లాభాలు ఉన్నాయో అలానే నష్టాలు కూడా ఉన్నాయి.  అతిగా అంజీర్ ని కనుక తింటే ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అంజీర్ ని అతిగా తింటే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

#1. క్యాల్షియం డెఫిషియన్సీ:

అంజీర్ ని అతిగా తినే వాళ్ళలో క్యాల్షియం లోపం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ కనుక మీరు రోజు అంజీర్ ని ఎక్కువగా తింటుంటే తగ్గించడం మంచిది లేదంటే క్యాల్షియం లోపంతో బాధ పడాల్సి వస్తుంది.

#2. కిడ్నీ సమస్యలు:

అంజీర్ ని అతిగా తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కిడ్నీలో రాళ్లు చేరి పోవడం వంటి ఇబ్బందులు అంజీర్ ని అతిగా తినడం వల్ల కలుగుతాయట.

#3. కడుపు ఉబ్బరం సమస్య:

దీన్ని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది కాబట్టి లిమిట్ గా మాత్రమే అంజీర్ తీసుకోవడం మంచిది.

#4. వేడి ఎక్కువ అవడం:

అంజీర్ ని అతిగా తినడం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది దీని మూలంగా రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ కనుక మీరు అంజీర్ ని ఎక్కువగా తీసుకున్నట్లయితే తగ్గించడం మంచిది లేదంటే అనవసరంగా ఈ సమస్యల బారిన పడాల్సి వస్తుంది.


End of Article

You may also like