మీకు ఎడమవైపు తిరిగి నిద్రపోయే అలవాటుందా..? అయితే ఈ విషయాలు మీకోసమే.!

మీకు ఎడమవైపు తిరిగి నిద్రపోయే అలవాటుందా..? అయితే ఈ విషయాలు మీకోసమే.!

by Mounika Singaluri

Ads

నిద్ర సుఖమెరుగదు అంటుంటారు కానీ.. కొంచమైనా సుఖం గా నిద్రపట్టకపోతే తెల్లారి పనులన్నీ అన్యమస్కం గా చేస్తుంటాము. ఆరోగ్యకరం గా పనులు చక్కదిద్దుకోవాలంటే.. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోవాలి.చాలా మంది కలత నిద్రపోతూ ఉంటారు. పడుకున్నట్లే ఉంటారు కానీ.. గాఢం గా నిద్రపోలేరు.

Video Advertisement

ఫలితం గా రోజంతా అలసటను ఫీల్ అవుతూ ఉంటారు. సరైన పొజిషన్ లో పడుకుంటేనే నిద్ర హాయిగా పడుతుంది. అయితే కొందరు వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్య రీత్యా చాలా మంచిదట.

sleeping left 1

మీకు ఎడమవైపుకు తిరిగి పడుకునే అలవాటు ఉందా..? లేకపోతే అలవాటు చేసుకోండి. ఇలా పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం పై డాక్టర్ జోహన్ డుయిలర్డ్ అనే డాక్టర్ గతంలోనే చాలా పరిశోధనలు చేశారట. కుడివైపు తిరిగి పడుకోవడం వలన శరీరంపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది అని ఆయన గుర్తించారు.

Also Read:   అబ్బాయిలూ.. ఊరగాయలు ఎక్కువగా తింటున్నారా..? దాని వల్ల వచ్చే సమస్యలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు..!

sleeping left 2

అదే ఎడమవైపుకు తిరిగి పడుకునే వారిలో మాత్రం రెట్టింపు ఉత్సాహం ఉంటోందట. కుడివైపు తిరిగి పడుకుంటే జీర్ణ వ్యవస్థ పై ఆ ప్రభావం పడుతుంది. అదే ఎడమవైపు పడుకుంటే జీర్ణవ్యవస్థలోని ఆమ్లాలు సక్రమంగా పని చేస్తాయి. అంతేకాదు, తిన్న ఆహరం చక్కగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు ఇబ్బంది లేకుండా బయటకి వెళ్లిపోతాయి. జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన అవయవం అయిన లింఫ్ మనం ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వలన సక్రమంగా పని చేస్తుంది.

sleeping left

అంతే కాదు శరీరంలో ఇతర జీవ క్రియలు కూడా సక్రమంగా జరుగుతుందట. రక్తం శుద్ధి అవుతుందట. అన్ని అవయవాలకు సక్రమంగా రక్తం అందుతుంది. ఉదయాన్నే శరీరం ఉల్లాసంగా ఉంటుందట. ఇక, ఆ వైద్యుడు చెప్పిన మరిన్ని విషయాలను ఈ వీడియోలో చూసేయండి.

Also Read:  మోచేతికి ఒకోసారి సడన్ గా ఏదైనా తగిలితే “షాక్” కొట్టినట్టు ఎందుకు అనిపిస్తుందో తెలుసా.?


End of Article

You may also like