చీరలు కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే..?

చీరలు కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే..?

by Mohana Priya

Ads

భారతీయ సంస్కృతికి వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి భారతీయ వస్త్రధారణ అంటే ముందుగా గుర్తొచ్చేది చీర. భారతదేశపు స్త్రీలు అని చెప్పాలి అంటే చీరని ప్రతీకగా భావిస్తారు. ఎన్నో రకాల చీరలు భారతదేశంలో అందుబాటులో ఉంటాయి. ఎన్నో డిఫరెంట్ మెటీరియల్స్ లో ఇవి దొరుకుతాయి. పెద్దవారి నుండి చిన్నవారి వరకు ప్రతి వారు చీరని ఇష్టపడతారు. ఎంతోమంది ప్రముఖులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా వేడుకలకు వెళ్ళినప్పుడు చీరని ధరించి వెళ్తారు. వారు అక్కడ తమ ప్రతిభను మాత్రమే కాకుండా, తమ దేశాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంటారు.

Video Advertisement

health issue due to saree

అయితే చీర వల్ల ఆరోగ్య సమస్య వస్తుంది అంటే నమ్మడానికి కష్టమైన విషయమే. కానీ ఇది నిజం. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం చీరల వల్ల క్యాన్సర్ సోకుతుంది అని తేలింది. చీరలు కట్టుకోవడం వల్ల క్యాన్సర్ సోకుతుంది అని కాదు. చీర కట్టే విధానంలో చేసే ఒక పని వల్ల ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చీర, పెట్టికోట్ ధరించినప్పుడు నడుముకి బిగుతుగా ఉండేలాగా ధరిస్తారు. దానివల్ల అలా బిగుతుగా ధరించిన ప్రాంతంలో నల్లగా అయిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టికోట్ కట్టిన భాగంలో నల్లగా అవ్వడం, గాలి ఆడక పోవడం వల్ల అక్కడ హైజిన్ తక్కువ అవ్వడం వల్ల ఇలాంటివి అవుతాయి.

two bangaluru women fight for a saree..!!

దీని ద్వారా వచ్చే క్యాన్సర్ ని స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) అని అంటారు. ఇది స్క్వామస్ సెల్స్ ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇవి శరీరం మీద చర్మం మధ్య లేయర్ లో, అలాగే అవుటర్ లేయర్ లో ఉన్న చర్మం మీద ఏర్పడతాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ కి ఎక్కువ సేపు శరీరం ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ రేడియేషన్ కి ఎక్కువ కవర్ చేసుకోకుండా ఉన్న చర్మం మీద కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. నుదురు, చేతులు, మెడ భాగం చెవులు, పెదాల భాగంలో ఇలాంటి సెల్స్ అభివృద్ధి చెందుతాయి.  పాదాల భాగంలో కూడా ఇలాంటి సెల్స్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటాయి.

health issue due to saree

కేవలం చీర మాత్రమే కాదు. బిగుతుగా ఉండే జీన్స్ లాంటివి వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విపరీతమైన వేడిలో ఉన్నప్పుడు ఇలాంటి క్యాన్సర్ వస్తుంది. అందుకే బీహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఇటీవల ఒక 68 సంవత్సరాల మహిళకి ఈ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఈ విషయాలు బయటికి వచ్చాయి. అందుకే శరీరాన్ని వీలైనంత కవర్ చేయాలి అని, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి అని, ఒకటే చోట కూర్చోకుండా, కదలిక ఎక్కువగా ఉండేలాగా లైఫ్ స్టైల్ ఏర్పరుచుకోవాలి అని, బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెప్తున్నారు.

ALSO READ : IPL 2024 : SRH VS CSK మ్యాచ్ లో… కావ్య మారన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like