Home Sports Adda IPL 2024 : SRH VS CSK మ్యాచ్ లో… కావ్య మారన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

IPL 2024 : SRH VS CSK మ్యాచ్ లో… కావ్య మారన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Mohana Priya

గత శనివారం నాడు సొంత గడ్డ మీద హైదరాబాద్ జట్టు మెరిసింది. 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2024 లో జరిగిన 18వ మ్యాచ్ లో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసి, హైదరాబాద్ జట్టుకి 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టాస్ ఓడిన చెన్నై జట్టు బ్యాటింగ్ లోకి దిగింది. దాంతో చెన్నై జట్టుకి హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ ప్రారంభంలోనే రచిన్ రవీంద్ర (12)ను భువనేశ్వర్ ని అవుట్ చేశారు.

girl with kaviya maran in csk vs srh

ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26)ను షాబాజ్ అహ్మద్ పెవిలియన్‌కు పంపించగా, తర్వాత వచ్చిన అజింక్య రహానే (35), శివమ్ దూబే (24 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) స్కోర్ చేశారు. డారిల్ మిచెల్ (13) చేయగా, తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 31 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దాంతో చెన్నై నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ కేవలం 12 బంతుల్లోనే 37 చేయగా, మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 31, 3 ఫోర్లు, ఒక సిక్స్‌) తో చెలరేగిపోయారు.

girl with kaviya maran in csk vs srh

హైదరాబాద్ ఆడిన 4 మ్యాచ్ లలో, 2 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్ జట్టు ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి అధినేత కావ్య మారన్ వస్తారు. మొన్న కూడా కావ్య వచ్చారు. హైదరాబాద్ జట్టు గెలవడంతో ఆనందంగా గంతులు వేశారు కావ్య. అయితే కావ్యతో పాటు ఒక అమ్మాయి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఆ అమ్మాయి మరెవరో కాదు. మొన్నటి మ్యాచ్ లో చెలరేగిన అభిషేక్ శర్మ చెల్లెలు కోమల్ శర్మ. కోమల్ శర్మ ఇప్పుడు అమృత్ సర్ లో ఉన్న ఎస్.జి.ఆర్.డి మెడికల్ కాలేజ్ లో డాక్టర్ గా చేస్తున్నారు. అభిషేక్ శర్మకి మరొక సోదరి కూడా ఉన్నారు. ఆమె సానియా శర్మ. ఆమెకి పెళ్లి అయ్యి అమైరా అనే కూతురు ఉంది. ఇప్పుడు అభిషేక్ శర్మ సోదరి కావ్యతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.

ALSO READ : తండ్రి ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ తో.. బాలకృష్ణ తీసిన 7 సినిమాలు ఇవే! దేని రిజల్ట్ ఏంటంటే.?

You may also like