ఒకసారి మనల్ని ఎవరైనా అడిగితే మన దగ్గర ఉన్న కొంత అమౌంట్ ని వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఆర్థిక కష్టాలు చూడలేక మనం కాస్త సహాయాన్ని ఇస్తాము కొంతమంది చెప్పిన సమయానికి తిరిగి వాటిని చెల్లిస్తుంటారు. కొంతమంది మాత్రం అప్పు తీసుకుని ఏళ్లు గడిచిపోతున్నా సరే ఇవ్వరు.
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు అని కాస్త గౌరవం కూడా ఉంచుకోరు. కానీ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే సరైన సమయానికి ఇచ్చేయడం మంచిది.
ఎందుకంటే ఇతరులకి కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్లకి కూడా డబ్బులు ఊరికే రావు కదా.. అయితే మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి తిరిగి వాళ్ళు మీకు చెల్లించడం లేదా..? అయితే ఇదే మీకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడానికి అవుతుంది. పైగా ఇవి చాలా మంచి మార్గాలు. సులభంగా మంచి మార్గంలో రికవరీ చేసుకోవచ్చు.
మరొకరి చేత అడిగి చూడండి:
మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లయితే మీరు స్వయంగా అడగకుండా మీ పరిస్థితి గురించి ఒక వ్యక్తి సహాయం తీసుకుని అడగమని చెప్పండి. దీంతో వారికి మీ బాధ అర్థం అవుతుంది. తద్వారా వాళ్ళు పే చేయడానికి అవుతుంది.
లీగల్ ఆప్షన్లు:
మీ దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి చాలా కాలం నుండి ఇవ్వకపోతుతే ఈ లీగల్ ఆప్షన్లుని ఫాలో అవ్వొచ్చు.
#1. లీగల్ నోటీసు పంపండి:
లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపించడం ద్వారా డబ్బులు రికవరీ చేసుకోవచ్చు. పైగా ఇది చట్టబద్ధ ప్రక్రియ. నోటీస్ పిరియడ్ లోగా చెల్లించాలి లేదంటే చర్యలు తీసుకో వచ్చు.
#2. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి:
వారిమీద ఎఫ్ఐఆర్ ని కూడా ఫైల్ చేయొచ్చు. ఐపీసీ లోని 406, 420 సెక్షన్ మీద కేసు పెట్టొచ్చు.
#3. సివిల్ సూట్:
డబ్బులు రికవరీ చేసుకోవడానికి లాయర్ సివిల్ సూట్ దాఖలు చేయొచ్చు.