Ads
ఒక మనిషి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అంటారు. ఇదే నిజమని చాలా మంది నిరూపించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక వ్యక్తి కూడా చేరారు. వివరాల్లోకి వెళ్తే, సమయం కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన యలగాడ బాలరాజు ఒక ఆటో డ్రైవర్. బాలరాజు చిన్నతనంలోనే సైకిల్ మెకానిక్ గా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించారు.
Video Advertisement
ఆపదలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేసి ప్రశంసలు పొందారు. 2008 నుంచి 2014 వరకు హరిజన యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు బాలరాజు. 2015లో మదర్ థెరిసా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే గతంలో బాలరాజు కాంగ్రెస్ లో ఉన్నారు.
2014 లో వై.య.స్.ఆర్.సి.పి కౌన్సిలర్ గా పోటీ చేసి 350 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి ఎక్కడ సమస్య వచ్చినా కానీ పరిష్కరించడానికి ముందుండేవారు బాలరాజు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ, ప్రజా ప్రతినిధిగా కూడా బాధ్యతలను నిర్వహించారు బాలరాజు. బాలరాజు సేవలను గుర్తించిన పార్టీ రెండోసారి కౌన్సిలర్ సీటు ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో బాలరాజు 13 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి 385 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ చైర్మన్ లు ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో సామాజిక సమీకరణాలలో భాగంగా మరొక వైస్ చైర్ పర్సన్ గా బాలరాజు ని ఎంపిక చేశారు.
End of Article