Ads
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలంటూ కోరిన ఓ మహిళను ఆటో డ్రైవర్ కాలితో తన్నిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి లో జరిగింది. అప్పు తిరిగివ్వమని కోరడం తో అసహనం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి ఆ మహిళను కాలితో తన్నాడు. దీనితో.. ఆమె స్పృహ తప్పి వెనక్కి పడిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
Video Advertisement
ప్రస్తుతం ఆ మహిళ మంగళగిరి ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటోంది. వివరాల్లోకి వెళితే, గోవర్ధిని అనే మహిళ గుంటూరు డిస్ట్రిక్ట్ చిర్రావూరు కు చెందిన గోపికృష్ణ అనే యువకుడికి వడ్డీ కింద మూడు లక్షల రూపాయలను గతం లో అప్పు గా ఇప్పించింది. అయితే.. ఆ డబ్బుని తిరిగి చెల్లించకుండా సదరు వ్యక్తి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమం లో విసుగెత్తిన గోవర్ధిని గోపికృష్ణ గురించి ఎంక్వయిరీ చేయగా.. మంగళగిరి మండలం రామచంద్రపురం సమీపం లో ఉన్నట్లు తెలిసింది.
దీనితో.. అతనిని వెతుకుతూ అక్కడకు వెళ్ళింది. అతని ఆటో కి.. ఆమె బైక్ ని అడ్డు గా పెట్టి డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిలదీసింది. ఆటోలోనే కూర్చుని ఉన్న గోపికృష్ణ ఆగ్రహానికి లోనై ఆమెను తన్నాడు. దీనితో ఆమె నాలుగు అడుగుల దూరం లో పడింది. ఆమె కుటుంబ సభ్యులు గోపికృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అతనిపై కేసు నమోదు చేసారు.
Watch Video:
End of Article