Ads
2009 వ సంవత్సరం లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనవసరంలేదు…జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు దీని సీక్వెల్ అవతార్ 2 గా రూపుదిద్దుకొంటుంది..ఇప్పటికే నిర్మాతలు డిసెంబర్ 2021 లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.అయితే కరోనా మహమ్మారి వారం లాక్ డౌన్ పాటించాల్సి రావటం..షూటింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ లాంటి పనులు ఏవి సజావుగా జరగకపోవడం వలన మరి కొద్దీ రోజులు వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Video Advertisement
.అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్స్ పనులు తిరిగి మొదలు కావడం..సినిమాలకి సంబందించిన పనులు పునప్రారంబించడం తో..మళ్ళీ పనులు ఊపందుకున్నాయి..చిత్ర నిర్మాత జాన్ లాండూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “మా అవతార్ కోసం స్పెషల్ గా వేసిన సెట్లు రెడీ అయ్యాయి. వచ్చేవారంలో న్యూజిలాండ్‌లో షూటింగ్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం”అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసారు..
https://www.instagram.com/p/CAdy0QNpwLP/
దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారాయి..ప్రేక్షుకుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా దర్శక నిర్మాతలు అతి తీవ్రంగా శ్రమిస్తున్నారు..మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు..ఈ సినిమా ౩డి లో రూపుదిద్దుకుంటూ ఉండగా…ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఒకే రోజు విదుదల కాబోతుంది ఈ సినిమాలోని దృశ్యాలని కళ్ళ జోడు లేకుండానే ౩డి విజువల్స్ కనపడేలా టెక్నాలజీ ని రూపుదిద్దతునన్టు సమాచారం
End of Article