సౌత్ ఇండస్ట్రీ పై అవికా గోర్‌ కామెంట్స్ ..!

సౌత్ ఇండస్ట్రీ పై అవికా గోర్‌ కామెంట్స్ ..!

by kavitha

Ads

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్‌ అవికా గోర్‌ తెలుగులో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సీరియల్ మంచి మిగతా భాషల్లో కూడా టీఆర్పీ రేటింగ్‌తో సక్సెస్ అయ్యింది. ఈ సీరియల్ తో అవికా గోర్‌ కు తెలుగులో విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

Video Advertisement

తెలుగు సినిమాల ద్వారా పాపులారిటీని, డబ్బు సంపాదించుకుని, సక్సెస్ ను అందుకున్న హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్ళడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. అయితే అలా బాలీవుడ్‌కి వెళ్ళిన హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ పై బురద చల్లడం కూడా జరుగుతోంది. తాజాగా అవికా గోర్‌ సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Avika-Gor-viral-commentsహీరోయిన్ గా టాలీవుడ్ మూవీ ఉయ్యాల జంపాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్‌, ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, తాను నేను, సినిమా చూపిస్తా మావ, రాజు గారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. హిందీ సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన 1920:హార్రర్ ఆఫ్ ద హార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఈక్రమంలో అవికా గోర్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిలో ఆమె సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. “దక్షిణాది ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. అక్కడ స్టార్ హీరోల పైనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడి ఆడియెన్స్ కూడా స్టార్స్ చిత్రాలనే చూస్తారని, టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ.” అని అవికా గోర్‌ కామెంట్స్ చేసింది. నెటిజెన్లు అవికా గోర్‌ కామెంట్స్ పై మండిపడుతున్నారు. తెలుగు చిత్రాలలో నటించి, గుర్తింపు వచ్చిన తరువాత అదే ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్లు చేయడం సరి కాదని అంటున్నారు.

watch video:

 

Also Read: అంత పెద్ద ప్రాజెక్ట్ ని యష్ రిజెక్ట్ చేశారా..? అది ఏంటంటే..?

 


End of Article

You may also like