పిల్లిని కాపాడారు 10 లక్షలు బహుమతి పట్టారు…వీడియో వైరల్

పిల్లిని కాపాడారు 10 లక్షలు బహుమతి పట్టారు…వీడియో వైరల్

by Anudeep

Ads

మనం ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ మాటలు నిజమని నమ్మడానికి వీళ్ళకి జరిగిందే ఒక ఉదాహరణ. తోటి మనుషులనే కాదు జంతువులను కూడా ప్రేమించే జంతు ప్రేమికులు ఎంతోమంది మనలో ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వారే వీరు. అసలేం జరిగిందంటే దుబాయ్ లోని ఒక ఎత్తయినా భావనం యొక్క 2వ అంతస్తు నుండి ఒక పిల్లి క్రింద పడిపోయింది అదే సమయంలో అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు ఆ పిల్లి క్రింద పడకుండా ఒక బ్లాంకెట్ పెట్టి పిల్లి నేలపై పడి చనిపోకుండా కాపాడారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ జరిగిన దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీన్ని చూసిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రాజు అయినా షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ ఏఐ మాకటౌమ్ అ ఆ వీడియో ని పోస్ట్ చేసి ఆ పిల్లి ని కాపాడిన వాళ్ళని ఎంతగానో ప్రశంసించి ఒక్కొక్కరికి 50000 దుబాయ్ దీనర్ అంటే మన కరెన్సీ లో 1000000 రూపాయిలు బహుమానం గా ప్రకటించారు.

Video Advertisement

కేవలం ఒక పిల్లిని కాపాడినందుకే ఇంత బహుమానమా అని ఆశ్చర్య పడకండి నిజానికి ఆ పిల్లి కడుపుతో ఉందని అందువల్ల వారు కాపాడింది పిల్లిని మాత్రమే కాదు దాని పిల్లల్ని కూడా అని తెలియజేశారు.ఆ పిల్ల ని కాపాడిన నలుగురిలో ఇద్దరు భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి వెళ్లిన వారు కాగా మరొకరు పాకిస్థాన్, ఇంకొకరు బంగ్లాదేశ్ కి చెందిన వారు. వారిలో ఇండియాకి చెందిన నస్సేర్ మహమ్మద్ డ్రైవర్ గా పని చేస్తుండగా, రషీద్ మహమ్మద్ ఇండియన్ గ్రోసరీ షాప్ యొక్క ఓనర్, పాకిస్థాన్ కి చెందిన అతిఫ్ మహమ్మద్ సేల్స్ మాన్ గా వర్క్ చేస్తుండగా బంగ్లాదేశ్ కు చెందిన ఆశరీఫ్ బ్లేయింజా సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళ నలుగురికి ఈ సంఘటనకు ముందు వరకూ ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం లేకపోవడం కొసమెరుపు


End of Article

You may also like