Ads
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రెమో, డాక్టర్, ప్రిన్స్, లాంటి చిత్రాలతో తెలుగులో ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నాడు. శివకార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ అయలాన్. ఈరోజు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : అయలాన్
- నటీనటులు : శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, తదితరులు
- నిర్మాత : కోటపాడి జే రాజేష్
- దర్శకత్వం : ఆర్.రవికుమార్
- సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
- విడుదల తేదీ : జనవరి 26, 2024
స్టోరీ :
భూమి పైకి వచ్చిన ఒక ఏలియన్ తమీజ్ (శివకార్తికేయన్) ను కలుస్తుంది. తమీజ్ కు సుగిర్త రాజా(కరుణాకరన్) ,టైసన్(యోగిబాబు) అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ఆ ఏలియన్ కి టట్టూ అనే పేరును పెడతారు. ఆ ఏలియన్ తో వారు చాలా ఇబ్బందులు పడుతారు. ఆ తరువాత ఏలియన్ చెడు ఉద్దేశ్యం ఉన్న వ్యక్తుల చేతికి చిక్కుతుంది. వారి నుండి తమీజ్, అతని ఫ్రెండ్స్ ఏలియన్ ని ఎలా కాపాడారు? టట్టూ అసలు భూమి పైకి ఎందుకు వచ్చాడు? టట్టూ తిరిగి అతని గ్రహానికి వెళ్లాడా? అనేది మిగిలిన కథ.
రివ్యూ :
దర్శకుడు రవికుమార్ సైన్స్ ఫిక్షన్ మూవీకి లోకల్ ఫ్లేవర్ తో తెరకెక్కించాడు. రెండో చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమా తీయడం అంటే సాహసం అని చెప్పవచ్చు. అయితే ఆ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రొమాన్స్, హీరోకి సైడ్‌కిక్‌లుగా ఇద్దరు హాస్యనటులు, కార్పోరేట్ విలన్, ఉత్తరాదికి చెందిన ఒక నటుడు (ఇక్కడ, అది శరద్ కేల్కర్), చిటికెడు మదర్ సెంటిమెంట్ మరియు కూడా. సేంద్రీయ వ్యవసాయం గురించి సందేశాలు రొటీన్ అయినప్పటికీ, ఆ ఫీల్ కలగదు.
పలు హాలీవుడ్ సినిమాలలో చూసిన కాన్సెప్ట్‌లకు దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌లు, సూపర్ పవర్స్, యుఎఫ్‌ఓలు, ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్స్, పవర్‌ఫుల్ రోబోలు, ఫెమ్ ఫేటేల్స్ అయాలాన్‌ని అన్ని వయసుల వారికి వినోదాన్ని పంచుతుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు.
ఇక నటీనటుల విహాయనికి వస్తే, శివ కార్తికేయన్ తమీజ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తరువాత స్థానం టట్టూదే. కొన్ని సన్నివేశాలలో టట్టూకి శివకార్తికేయన్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్,కరుణాకరన్, యోగిబాబు వారి పాత్రల మేరకు నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్ బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- శివ కార్తికేయన్, టట్టూ
- కథనం
- ఏఆర్ రెహమాన్ సంగీతం
- సినిమాటో గ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కొన్ని లాజిక్ లేని సీన్స్
- అక్కడక్కడ సాగదీత
రేటింగ్ :
2.75 / 5
watch trailer :
End of Article