అయోధ్య రాముడు అచ్చం ఆ హీరోలాగే ఉన్నారా..? ఎవరంటే..?

అయోధ్య రాముడు అచ్చం ఆ హీరోలాగే ఉన్నారా..? ఎవరంటే..?

by kavitha

Ads

అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 500 ఏళ్ళకు పైగా చాలా మంది పోరాడారు. వారి పోరాటాల ఫలితంగా ఎట్ట‌కేల‌కి కోట్లాది భక్తుల క‌ల తీరింది. ఈ నెల 22న అయోధ్య‌లో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ తరువాత రోజు నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు పయనం అవుతున్నారు.

Video Advertisement

అయోధ్య రాముడిని కన్నులరా దర్శించి, తమ జన్మ ధన్యం చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు  అభిమానులు బాలక్ రామ్ కళ్ళు అచ్చం తమ అభిమాన హీరో కళ్ళలా ఉన్నాయని సంతోషపడుతూ, ఈ విషయాన్ని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును  కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్  అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని  ఫ్యాన్స్  వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్  విగ్రహం కళ్ళు మరియు  నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో  కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

Also Read: వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు… మీరు చూసేయండి…!


End of Article

You may also like