బీటెక్ చదివిన కుమార్తెను ఏ తండ్రి అయినా ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అబ్బాయికో, లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తికో ఇచ్చి వివాహం జరిపించాలని భావిస్తాడు. కానీ ఒక తండ్రి మాత్రం తన కూతురిని పాప్ కార్న్ బండి నడిపే ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు.

Video Advertisement

ఆ అమ్మాయి తండ్రి నిర్ణయానికి ఆలోచనలో పడగా ఆ యువకుడితో నీ జీవితం చాలా బాగుంటుందని అమ్మాయిని ఒప్పించి మరీ వివాహం జరిపించాడు. బీటెక్ చేసి, సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని, వీలయితే యూఎస్ వెళ్లి అక్కడే స్థిరపడాలని ఈ తరం యువత ఆలోచిస్తోంది. వివాహం చేసుకునే యువతుల మొదటి ఛాయిస్ కూడా ఇటువంటి అబ్బాయిలే. అమ్మాయిలే కాకుండా వారి తల్లి దండ్రులు తమ కుమార్తెలకి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయిల సంబంధం వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ తండ్రి మాత్రం బీటెక్ చదివిన అమ్మాయిని పాప్ కార్న్ బండి నడిపే కుర్రాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉన్నప్పటికి ఇది వాస్తవం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజమండ్రికి చెందిన సుధీర్ అనే యువకుడు నగరంలోని గాంధీ పార్కుకి వెళ్ళే రోడ్డు పక్కనే పాప్ కార్న్ బండి నడుపుతూ ఫ్యామిలిని పోషిస్తున్నాడు. పాప్ కార్న్‌తో మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్‌ను కూడా బండి పై అమ్ముతుంటాడు. ఆ బండి వద్ద దొరికేవి రుచిగా ఉండటంతో ఎప్పుడూ కస్టమర్లతో ఆ బండి దగ్గర రద్దీగా ఉంటుంది. అయితే సుధీర్ బీటెక్ ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని అంటే నమ్మి 10 లక్షలు అప్పు తెచ్చి కట్టాడు.  ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న సుధీర్‌ చేసిన అప్పులు తీర్చాలని, తన ఫ్యామిలిని కూడా పోషించాలని అనుకున్నాడు. అలా పాప్ కార్న్ బండి పెట్టుకుని 7-8 ఏళ్లగా నడుపుతూ సగం అప్పులను తీర్చాడు. ప్రస్తుతం అతని బిజినెస్ సాగుతోంది. కుటుంబ పోషణలోను ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు పెరుగుతోందని సుధీర్ కి పెళ్లి చేశారు.  పాప్ కార్న్ బండి నడిపేవాడికి పిల్లనిస్తారా అనుకున్నారు. అయితే సుధీర్ కి బీటెక్ చదివిన యువతితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిపించింది ఆ అమ్మయి తండ్రే కావడం విశేషం.
అమ్మయి పెళ్లి చేసుకోవడానికి సందేహించిన కుమార్తెను ఒప్పించి మరి పెళ్లి చేశాడు ఆ తండ్రి. జాబ్ చేసేవాడి కంటే కష్టపడి పనిచేసేవాడే బాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయితో నీ లైఫ్ బాగుంటుందమ్మా’ అని ఆ తండ్రి కూతురిని ఒప్పించాడు. ఆ అమ్మాయి తండ్రి డిగ్రీ పూర్తి చేశారంట. కొంత కాలం జాబ్ కోసం ప్రయత్నించి, జాబ్ రాకపోవడంతో ఆటో నడపటం ప్రారంభించాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్న సుధీర్ ఆఖరికి పాప్ కార్న్ బండి పెట్టుకొని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులు తీరిన తరువాత తన బిజినెస్ ను పెంచుకునే ఆలోచనలో సుధీర్ ఉన్నాడు.

Also Read: ప్రేమ వ్యవహారం… ఇప్పుడు రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే..? అసలు ఏం జరిగిందంటే..?