Ads
మామూలుగానే పాత సినిమా టైటిల్స్ ని కథకి మ్యాచ్ అయితే కొత్త సినిమాలకి పెట్టడం పరిపాటి. అయితే బాలకృష్ణ చాలా సినిమాలకి తన తండ్రి సినిమా టైటిల్స్ పెట్టుకొని హిట్స్ కొట్టాడు. మొత్తంగా తండ్రి ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్ తో బాలయ్య చేసిన సినిమాలు ఏమిటో చూద్దాం.
Video Advertisement
#1 కథానాయకుడు : నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా మారిన తర్వాత మొదటిసారి తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ సినిమా కథానాయకుడు. ఈ సినిమా టైటిల్ ని తన సినిమా టైటిల్ గా పెట్టుకున్న ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్.
#2 భలే తమ్ముడు: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భలే తమ్ముడు సినిమా సూపర్ హిట్ ఇది కూడా తన తండ్రి సినిమా టైటిల్ కావడం విశేషం. భలే తమ్ముడు సినిమాని పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించడం విశేషం.
#3 సీతారామ కళ్యాణం : సీనియర్ ఎన్టీఆర్ నటించిన సీతారామ కళ్యాణం ఎంత పెద్ద క్లాసిక్ హిట్టో అందరికీ తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ కూడా సేమ్ టైటిల్ తో ఒక సినిమా తీసి మంచి హిట్ సొంతం చేసుకున్నారు.
#4 నిప్పులాంటిమనిషి : ఈ సినిమా కూడా సీనియర్ ఎన్టీఆర్ కి మంచి హిట్ మూవీ. అదే టైటిల్ ని తన సినిమాకి పెట్టుకొని బాలకృష్ణ కూడా మంచి హిట్ కొట్టడం విశేషం. ఈ సినిమా అమితాబచ్చన్ హిందీ సినిమా జంజీర్ కి రీమేక్ అని అందరికీ తెలిసిందే.
#5 రాము: ప్రమాదంలో భార్యని పోగొట్టుకొని అదే ప్రమాదంలో కొడుకు నోరు కూడా పోగొట్టుకోవడంతో ఒక తండ్రి పడే ఆవేదన సీనియర్ ఎన్టీఆర్ రాము సినిమా. ఆ సినిమాఅప్పట్లో సూపర్ హిట్. అదే సినిమా టైటిల్ తో బాలకృష్ణ కూడా ఒక సినిమా చేశారు ఈ సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది.
#6 రాముడు భీముడు: ఈ సినిమా కూడా సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ అయితే ఇదే టైటిల్ తో సినిమా తీసిన బాలకృష్ణ పెద్దగా హిట్ ని సాధించలేకపోయారు.
#7 నర్తనశాల: ఇది ఎన్టీఆర్ సూపర్ డూపర్ క్లాసిక్ హిట్ సినిమా. అయితే ఇదే టైటిల్ తో బాలకృష్ణ ఒక మూవీ ని స్టార్ట్ చేశారు కానీ సౌందర్య అకాల మరణంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
End of Article