Ads
గత కొన్ని రోజులు క్రిందట భారత్ -చైనా బోర్డర్ లో జరిగిన ఇరు దేశాల ఆర్మీల ఘర్షణలో మన దేశ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే..దీనితో భారత దేశం లో ని ప్రతి పౌరుడు చైనా మీద విరుచుకు పడుతున్నారు..చైనా మీద ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.భారత్ లో చైనా ప్రొడక్ట్స్ కి ఉన్న ఆధరణ తెలిసిందే.అయితే వారికి బుద్ది చెప్పేలా ‘BOYCOTT CHINA ‘ ప్రొడక్ట్స్ అంటూ ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది.
Video Advertisement
అదలా ఉండగా..బిగ్ బాస్ హౌస్ సీజన్ 2 పార్టిసిపెంట్స్ అయిన కౌశల్ మండా – బాబు గోగినేని మధ్య జరిగిన మాటల యుద్ధం తెలిసిందే.తాజాగా కౌశల్ మండా పెట్టిన ఒక వీడియోలో చైనా ఫోన్ ని విరగ్గొడుతూ వీడియోని రిలీస్ చేసిన కౌశల్ కి కౌంటర్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టారు తన పేస్ బుక్ పేజీ ద్వారా..ఈయన తన మిలిటరీ డ్రెస్సూ combat fatigues వేసుకుని తన Kaushal Army తో Border కి వెళ్ళి దేశం తరపున పోరాడతాడు అనుకుంటే పాత ఫోన్లు పగలగొట్టుకుంటూ వీడియోలు తీయించుకుంటున్నాడు.
వీడియో తీసిన ఫోను చైనా ది అయినా కాకపోయినా దానిలో సిమ్ మాత్రం చైనా దే.మన జనాలు కూడా దారుణంగా ఉన్నారు. అప్పుడు అన్ని కోట్ల వోట్లు వేసి, గుండెల మీద tattoo కొట్టించి ఇప్పుడు 12 / 24 గంటల్లో ఒక పది వేల views కూడా ఇవ్వ లేదా? కనీసం వెయ్యి కూడా రాలేదా? మైత్రివనం లో గ్రూప్ ఏమయ్యింది? బంజారా హిల్స్ లో రమేష్ ఏమి చేస్తున్నాడు? అంటూ ఎద్దేవా చేసారు బాబు గోగినేని’
End of Article