బేబీ లో హీరోయిన్ చేస్తే బాగానే తప్పు పట్టారు… మరి యానిమల్ లో హీరో చేసిందేంటి.?

బేబీ లో హీరోయిన్ చేస్తే బాగానే తప్పు పట్టారు… మరి యానిమల్ లో హీరో చేసిందేంటి.?

by Mohana Priya

Ads

మన తెలుగు వాళ్ళు వేరే చోట్ల గుర్తింపు తెచ్చుకుంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదో మనకి బాగా తెలిసిన వాళ్ళు, లేకపోతే మన చుట్టాలు ఇంత గొప్ప ఘనతను సాధించారు ఏమో అనిపిస్తుంది.

Video Advertisement

అలా ఇటీవల ఒక డైరెక్టర్ బాలీవుడ్ హీరోతో సినిమా తీసి, భారతదేశం అంతా తన గురించి మాట్లాడుకునేలాగా చేశారు. ఆయన ఎవరో ఈపాటికి మీకే అర్థం అయిపోయి ఉంటుంది. యానిమల్ సినిమా ఇప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

issue shown in animal trailer

అసలు ఒక సినిమాలో ఒక హీరోని ఈ విధంగా కూడా చూపించే అవకాశం ఉందా అని బాలీవుడ్ వాళ్ళందరూ కూడా సందీప్ రెడ్డి వంగాని పొగుడుతున్నారు. అయితే, ఈ సినిమా మీద అంతకంటే ఎక్కువ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే మరొక హీరోయిన్ తృప్తికి బాగా పేరు వచ్చింది. ఇందులో హీరోని అందరూ తెగ పొగుడుతున్నారు.  తన భార్యని మోసం చేసి, మరొక అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు హీరో. అయినా కూడా మన ప్రేక్షకులు చాలా మందికి ఈ విషయం అంత పెద్ద నేరంగా అనిపించట్లేదు.

కానీ ఇదే పని ఒక అమ్మాయి చేస్తే మాత్రం అది కేవలం సినిమా అని చూడకుండా, అమ్మాయి కేవలం ఒక పాత్ర అని చూడకుండా, థియేటర్ లో ఆ అమ్మాయి పాత్రని బూతులు తిట్టారు. ఆ సినిమా కూడా ఇటీవల విడుదల అయ్యింది. అదే బేబీ సినిమా. బేబీ సినిమాలో వైష్ణవి కూడా, యానిమల్ సినిమాలో హీరో రణవిజయ్ లాగానే ఒకరిని ప్రేమిస్తుంది. పెళ్ళి వరకు కలలు కంటుంది. కానీ తప్పక అతన్ని మోసం చేయాల్సి వస్తుంది.

ఆ అమ్మాయికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఇంకొక ఆప్షన్ లేకుండా చేస్తాయి. కానీ ఆ అమ్మాయిని మన ప్రేక్షకులు బాగా తిట్టారు. “ఆ అమ్మాయిలో నన్ను మోసం చేసిన నా గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తోంది” అంటూ మాట్లాడిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ తెలిసి తెలియని వయసులో చేసిన పనికి వైష్ణవిని అంత తిట్టిన వారు, దాదాపు 40 సంవత్సరాలు ఉన్న రణవిజయ్ తన తండ్రి కోసం అనే ఒక వంక పెట్టుకొని మరొక అమ్మాయిని ప్రేమించడం చూసిన ప్రేక్షకులు మాత్రం, “హీరో అంటే వీడేరా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అందరూ ఇలాగే లేరు. అతను చేసిన పనికి తిట్టిన వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం హీరో చేసిన పనులు అన్ని మర్చిపోయి అతను హీరో అని, హీరో చేసాడు కాబట్టి అది కచ్చితంగా తప్పు కాదు అనే ధోరణిలోనే ఉన్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? అమ్మాయి, అబ్బాయి అని మారిపోగానే వాళ్ళు చేసిన పనులని మనం స్వీకరించే విధానం కూడా మారిపోతోందా? ఇక్కడ ఎవరి ఆలోచన తీరు మారాలి?

ALSO READ : TRIPTI DIMRI ABOUT ANIMAL: యానిమల్ సినిమా చూసి అమ్మానాన్న ఫీలయ్యారు… నటి కామెంట్స్ వైరల్…?


End of Article

You may also like