వైష్ణవి చైతన్య “బేబీ” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

వైష్ణవి చైతన్య “బేబీ” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

ఆనంద్ దేవరకొండ, హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ తన కెరీర్ లో మొదటి సినిమా నుండి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ కొనసాగుతున్నాడు. సెలెక్ట్ చేసుకున్న కథలో,  తన క్యారెక్టర్ లో కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Video Advertisement

ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘బేబి’. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో ఆడియెన్స్ ని పలకరించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబి’ తో ఆడియెన్స్ ముందుకి మరోసారి రాబోతున్నాడు. ఈ సినిమాని సాయిరాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, యాక్టర్ విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్  మూవీ రిలీజ్ కు ముందే హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పై చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. జులై 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే  సెన్సార్ జరిగే సమయంలో ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో ఆ డైలాగులను మ్యూట్ చేయాలని సెన్సార్ చిత్రబృందాన్ని కోరినట్టు తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా కొన్ని విజువల్స్ ని కట్ చేశారని సమాచారం. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని అందరు ఒక మిడిల్ క్లాస్ యువకుడి లవ్ స్టోరి అని అనుకున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా సెన్సార్ అప్ డేట్ గురించి తెలియడంతో అభిమానులు కంగారుపడుతున్నారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read: ఆ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ సౌందర్య ముఖంపై కాలు పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఇదేనా..??


End of Article

You may also like