Ads
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా ఓపికతో కూడుకున్న విషయం. ముందు చిన్న చిన్న పాత్రలు వేసి, ఆ తర్వాత పెద్ద నటుల స్థాయికి ఎదుగుతారు. అసలు ఇలాంటి ఒక ఫీల్డ్ లో ముందుకి రావాలి అంటే ఉండాల్సింది ఓపిక. చాలా మంది యాక్టర్లు అవ్వాలి, లేదా ఇండస్ట్రీలో ఇంకేదైనా చేయాలి అని అనుకొని వస్తారు. కానీ మధ్యలోనే ఆపేసిన వాళ్ళు కొంత మంది ఉంటారు. దానికి కారణాలు ఏదైనా అయ్యే అవకాశం ఉంది. కానీ కొంత మంది మాత్రం ఎలాగైనా సరే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలి అని కష్టపడతారు. చాలా మంది హీరోలు గతంలో చిన్న చిన్న పాత్రలు వేసిన వారే. వారి పాత్రలకి పేర్లు కూడా ఉండవు.
Video Advertisement
అలాంటి పాత్రలు వాళ్ళు చేశారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కనిపిస్తాయి. వాటన్నిటిని వీళ్లు దాటుకొని వచ్చిన ధైర్యం కనిపిస్తుంది. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి, ఇప్పుడు 50 సినిమాలు చేసిన హీరోగా ఎదిగారు. ఈ హీరో తమిళ్ హీరో. కానీ తెలుగులో ఈయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. పాత్ర బాగుంటే, తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే హీరో పాత్ర కాకపోయినా కూడా ఈ హీరో చేస్తారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. టాలెంట్ కి మరొక పేరు. నటుడు అంటే ఆయన లాగా ఉండాలి అని అనుకుంటారు. ఈ పైన ఫోటో విజయ్ సేతుపతి నటించిన లి అనే సినిమాలోనిది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రకి పేరు కూడా లేదు. 2007 లో ఈ సినిమా వచ్చింది. చాలా చిన్న పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు. ఇంకా కొద్ది సినిమాల్లో విజయ్ సేతుపతి చాలా చిన్న చిన్న పాత్రల్లో నటించారు. నా పేరు శివ సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ గా నటించారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మొదటి సినిమా పిజ్జా. ఒకే ఒక సినిమా విజయ్ సేతుపతి కెరీర్ గ్రాఫ్ మార్చేసింది. తన అభిమానులను సొంత వారిలాగా అనుకుంటారు. అందుకే విజయ్ సేతుపతికి ఇంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా విజయ్ సేతుపతి 50వ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి విడుదలై పార్ట్ 2 సినిమా చేస్తారు.
End of Article