Ads
కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కేజీఎఫ్ – 2 ట్రైలర్ విడుదల అయ్యింది.
Video Advertisement
సెకండ్ పార్ట్ లో రవీనా టాండన్, సంజయ్ దత్, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ట్రైలర్ చూస్తే ప్రకాష్ రాజ్ మనకి కథ చెబుతున్నట్లు తెలిసిపోతోంది. అనంత్ నాగ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో అలాంటి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
మొదటి భాగంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా విషయాలు ఉండబోతున్నాయి. అలాగే యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఎదగరా ఎదగరా అనే పాట ఇటీవల విడుదల అయ్యింది. ఈ పాట కామెంట్స్ లో చూస్తే చాలా వరకు ఒకటి మాత్రం కామన్ గా ఉంది. అదే పాట మధ్యలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. మొదటి పార్ట్ లో ఈ మ్యూజిక్ చాలా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత ఈ మ్యూజిక్ చాలా చోట్ల వినిపించింది. అసలు ఈ సినిమా పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చే మ్యూజిక్ కూడా ఇదే. ఈ మ్యూజిక్ సెకండ్ పార్ట్ లో కూడా వినిపిస్తోంది. సినిమా బృందం ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటోంది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతోపాటు లైవ్ ఈవెంట్ లో కూడా సినిమా బృందం పాల్గొని ప్రేక్షకులని పలకరిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో కూడా సినిమా బృందం పాల్గొన్నారు.
watch video :
End of Article