పెళ్ళికి ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం కోసం కొందరు సహజీవనం చేస్తూ ఉంటారు. అయితే.. ఆ జంట మాత్రం తమతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న వారిని వదిలేసి వచ్చి సహజీవనం చేస్తూ జీవిస్తున్నారు. ఒకరు భార్యని.. మరొకరు భర్తను వదిలేసి, ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేసారు. రెండేళ్లపాటు బాగానే ఉన్నారు. ఒక కొడుకు కూడా జన్మించాడు. అయితే.. ఓ చిన్న గొడవ కలత రేపింది. చివరకు ఆ మహిళా ప్రాణాలు కోల్పోయింది.

shan vaas athira

కేరళ లో అంచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలిసుల వివరాల ప్రకారం, అతిరా, షాన్ వాస్ లు రెండేళ్లు గా సహజీవనం చేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా. వీరిద్దరికి ఒకరినొకరు కలవకముందే వివాహం అయిపొయింది. అతిరా భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో వైపు షాన్ వాస్ కి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాన్ వాస్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేసాడు. ఆ తరువాత నుంచే.. అతిరా, షాన్ వాస్ కలిసి సహజీవనం చేస్తున్నారు.

man killed her lover

అతిరా సోషల్ మీడియా లో బాగా ఆక్టివ్ గా ఉండేది.. ఆమె ఒకప్పుడు టిక్ టాక్ లో చాలా వీడియోస్ పోస్ట్ చేసేది. ఈ క్రమం లో ఆమెకు మరో వ్యక్తి తో కూడా అఫైర్ ఉంది అని షాన్ వాస్ అనుమానించేవాడు. ఆ అనుమానం మితిమీరి అతిరాను కొట్టే వరకు వచ్చింది. ఓసారి ఆమెను అంతం చేయాలనీ భావించి..ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు.

women died

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అతిరా ప్రాణాలు దక్కలేదు. అయితే.. ఆమె చనిపోయేముందు తనపై షాన్ వాస్ కిరోసిన్ పోసి నిప్పు అంటించాడని చెప్పింది. ఈ మేరకు పోలీసులు షాన్ వాస్ పై కేసు నమోదు చేసారు.