Ads
ఇటీవల కాలంలో కళ్ళముందు ఘోరం జరుగుతుంటే ఆపాల్సింది పోయి వీడియోలు తీస్తున్నారు. తాజాగా గుజరాత్లో జరిగిన ఈ దుర్ఘటన జనం తీరుకి అద్దం పడుతుంది. ఓ ప్రేమోన్మాది తాను ప్రేమించిన అమ్మాయిని గొంతు కోసి చంపేశాడు. ఆమె కన్న తల్లి ముందరే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.
Video Advertisement
చుట్టూ అంతమంది జనాల ముందు పట్టపగలే ఆ దుర్మార్గుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. చుట్టూ ఉన్న జనం కూడా వీడియోలు తీయడంలో నిమగ్నం అయిపోయి ఆమెను కాపాడలేకపోయారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన గ్రీష్మా వెకారియా(21) ను ఓ ప్రేమోన్మాది పట్టపగలే గొంతు కోసి చంపాడు. ఆమె పీకపై కత్తి పెట్టి ఎవరు దగ్గరకి రావద్దు అంటూ అందరిని బెదిరించాడు. నోటిలో పాన్ నములుతూ నిర్లక్ష్యంగా, కనికరం లేకుండా ఆమె గొంతు కోసేశాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్కడికీ ఆమె తల్లి, బంధువులు అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా అతను వారిపై కూడా దాడి చేసాడు.
అతని పేరు ఫెనిల్ గొయాని. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భయాందోళనలని కలిగిస్తోంది. ఫిబ్రవరి 12 వ తేదీన కామ్రేజ్ పసోదరా ప్రాంతం లో ఉన్న ఆమె ఇంటి వద్దకి వెళ్లి మరీ ఈ దాడికి పాల్పడ్డాడు. మరో వైపు చుట్టూ జనాలు కలిసికట్టుగా ఎదిరించి ఉంటె ఆమెని కాపాడగలిగి ఉండేవారు. కానీ.. ఎవరు ధైర్యం చేయలేదు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకి కానీ ఆ సైకోని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. హత్య జరిగాక 9 రోజుల తరువాత అతనిపై చార్జిషీట్ ను దాఖలు చేసారు. ఈ కేసుపై 2500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది.
ఈ ఛార్జ్ షీట్ ను తయారు చేయడం కోసం పోలీసులు 190 మంది సాక్షుల్ని, 25 మంది ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించారు. ఈ ఛార్జ్ షీట్ ను ఇప్పటికే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు పెట్టారు. నిందితుడు ఫెనిల్ గతంలో ఓ కారు దొంగతనం కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. గ్రీష్మా తో కలిసి ఒకే కాలేజీ లో చదువుకున్నాడు. ఆ తరువాత అటెండన్స్ సరిపోక డిబార్ అయ్యాడు. గ్రీష్మని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు.
ఈ విషయమై గ్రీష్మ పేరెంట్స్ ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే.. ఫెనిల్ పేరెంట్స్ తమ కొడుకు ఇంక ఇబ్బంది పెట్టడు అని మాటివ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయినా ఫెనిల్ కు వార్నింగ్ ఇచ్చారు. తన ప్రేమని ఒప్పుకోకుండా, ఫామిలీ తో వార్నింగ్ ఇప్పించింది అన్న కారణంగా గ్రీష్మ పై కోపం పెంచుకున్నాడు. ఆ కక్ష ఆమె ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది.
End of Article