“నేనో బ్యాడ్ డాటర్” ని అంటూ హాస్టల్ లోనే ఉరి వేసుకున్న ఎంటెక్ విద్యార్థిని.. అసలేం జరిగింది..?

“నేనో బ్యాడ్ డాటర్” ని అంటూ హాస్టల్ లోనే ఉరి వేసుకున్న ఎంటెక్ విద్యార్థిని.. అసలేం జరిగింది..?

by Anudeep

Ads

హెచ్ సి యు హాస్టల్ లో నే ఎంటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మ హత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే, ఆర్.మౌనిక (27) పెద్దపల్లి జిల్లా కు చెందిన కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన దంపతులు రఘుశాల లచ్చయ్య, రజిత ల కుమార్తె. హెచ్ సి యు లో నానో టెక్నాలజీ కోర్స్ లో ఎంటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది.

Video Advertisement

mounika

క్యాంపస్ లోనే బాలికల వసతి గృహం 2 లో ఆమె గత కొన్ని రోజులు గా ఉంటోంది. ఎంటెక్ విద్యార్థినులను క్యాంపస్ లోకి అనుమతించడం తో ఆమె ఇటీవలే ఊరినుంచి హాస్టల్ కి వచ్చింది. కాగా సోమవారం ఉదయం ఆమె తన గదిలోంచి బయటకే రాలేదు. ఇతర విద్యార్థులు వెళ్లి పిలిచినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం తో అనుమానం ఎక్కువ అయింది.

mounika 3

లోపల ఏమి చేస్తోందో అని కిటికీ తలుపులు తెరచి చూడగా.. ఆమె పైకిటికీ చువ్వకు ఉరి వేసుకుని కనిపించింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆమె హాస్టల్ లో ఉంటోంది. ఆమె తండ్రి లచ్చయ్య ఊరిలో వ్యవసాయం చేస్తుంటారు. పదవతరగతి వరకు ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది.

mounika 4

ఆ తరువాత బాసర ట్రిపుల్ ఐటి లో సీటు రావడం తో అక్కడ డిగ్రీ పూర్తి చేసి, హెచ్ సి యు లో ఎంటెక్ చదువుతోంది. “ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యు నాన్న.. అమ్మా ” అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.


End of Article

You may also like