పెద్ద స్కెచ్ వేశారుగా ఈ సైబర్ నేరగాళ్లు…మద్యం డోర్ డెలివరీ అంటూ బగ్గా వైన్స్‌ పేరుతో మోసం.!

పెద్ద స్కెచ్ వేశారుగా ఈ సైబర్ నేరగాళ్లు…మద్యం డోర్ డెలివరీ అంటూ బగ్గా వైన్స్‌ పేరుతో మోసం.!

by Anudeep

ఆన్ లైన్ మోసాల గురించి పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుకుంటారు.వేలకి వేలు పోగొట్టుకుంటారు. మనుషుల అవసరాలని బట్టి అదును చూసి వల విసురుతుంటారు సైబర్ నేరగాళ్లు . మనోళ్లు కూడా వెనకాముందు ఆలోచించకుండా బుట్టలో పడిపోతారు.తర్వాత ఏడ్చి ఏం లాభం. తాజాగా మద్యం డోర్ డెలివరి అనగానే డబ్బులు పంపించి అటు మందు రాక, డబ్బులు పోయి అడ్డంగా బుక్కయ్యాడు ఒక హైదరాబాదీ.

Video Advertisement

లాక్ డౌన్ నేపధ్యంలో గత ఇరవై రోజులుగా మందుబాబులకి మందు లేదు. వారి కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేవ్ . కాని అలవాటు పడిన నాలుక ఊరుకుంటుందా. బ్లాక్లో కొనుక్కుని తాగాలనైనా చూస్తుంది. అలా వేలకు వేలు పోసి తాగే మహానుభావులు ఉన్నారు.. అంత డబ్బు పెట్టలేని వారు పిచ్చెక్కిపోతున్నారు..వైన్ షాపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దొరికిందే ఛాన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికే మందు పంపిస్తాం అని బోల్తా కొట్టిస్తున్నారు.తాజాగా బగ్గావైన్స్ పేరుతో జరిగిన ఈ -మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది.

హైదరాబాద్ సిటిలోని కొందరికి ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది..ఆల్కహాల్ అమ్ముతున్నామని, బుక్ చేసుకుని డబ్బులు పంపిస్తే , మందు ఇంటికే పంపుతామనేది ఆ మెసేజ్ సారాంశం. చాలా మంది చూసి చూడనట్టు వదిలేసినా కొందరుంటారు కదా మహానుభావులు, మందు ప్రియులు..గౌలిపురకి చెందిన రాహుల్ ఆ మెసేజ్ చూసి టెంప్ట్ అయి ,ఎలా అియనా మందు తెప్పించుకోవాలని ,వారిని కాంటాక్ట్ట చేశాడు.  బగ్గా వైన్స్‌ పేరుతో క్యూఆర్‌ కోడ్ పంపించి దానికి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అరగంటలో మద్యం ఇంటికే పంపిస్తామంటూ అవతల నుండి సమాధానం.

ఇంకెందుకాలస్యం, అరగంట వెయిట్ చేస్తే ఎంచక్కా పండగ చేస్కోవచ్చని ఆలోచించి వెనకాముందు ఆలోచించకుండా ,అది నిజమా, ఫేకా అని కూడా పట్టించుకోకుండా ఏకంగా 51వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. మందు అరగంటలో కాదు కదా రెండు రోజులైనా రాలేదు , మోసపోయానని తెలుసుకుని బోరుమన్నాడు. పోలీసులని ఆశ్రయించాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు బగ్గా వైన్స్ పేరుతో కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతుండడంతో బగ్గా వైన్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

మరో ముఖ్యమైన విషయం వైన్ హోం డెలివరి చేస్తాం అంటూ ఫేస్ బుక్లో కూడా కొంత మంది పోస్టు చేస్తున్నారు.అవి చూసి మోసపోకండి. అయినా ఆన్లైన్లో ఏది వస్తే అది నమ్మేయడమేనా,పెద్ద పెద్ద హోటల్స్ కి , బడా వైన్ షాప్స్ కే మందు అమ్మడానికి అనుమతి లేదు, అలాంటిది ఒక మెసేజ్ చూసో,లేదంటే ఫేస్ బుక్లో బుక్ చేసుకుంటే మీకు మందు ఎవరు పంపుతార్రా బాబూ, కొంచెం ఆలోచించండి. అలా ఎవడైనా పంపినా తెలుసు కదా పోలీసోళ్లు బయటికి వస్తే ఎలా వాయించేస్తున్నారు . కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండండి. అయినా 50వేలు పంపాడంటే ఎంత ముఖం వాచిపోయి ఉన్నావో రాహులా..


You may also like

Leave a Comment