Ads
సినిమా విడుదల ఎంత ఆలస్యం అయితే, ప్రేక్షకులలో అంత ఆసక్తి పెరుగుతుంది. ఆ క్యూరియాసిటీ నుండి కొత్త కొత్త కథలు బయటికి వస్తూ ఉంటాయి. “సినిమాలో ఇలా జరిగి ఉండొచ్చు ఏమో”, “అలా జరిగి ఉండొచ్చు ఏమో” అని కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కామెంట్స్ లో కనిపించే చాలా విషయాలు నిజం కూడా అవుతాయి.
Video Advertisement
ఇప్పటికే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు. మార్చి 15 వ తేదీన ఆలియా భట్ పుట్టినరోజు. సందర్భంగా ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
బాహుబలి ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఒక కోఇన్సిడెన్స్ ఉంది. రెండు పాన్ ఇండియన్ సినిమాలే అని అనుకోకండి. కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఒకసారి పైన ఉన్న ఇమేజ్, అలాగే కింద ఉన్న ఇమేజ్ గమనించండి. ఈ 2 బాహుబలి సినిమాలో దేవసేన ఇంకా శివగామి పాత్రల ఇమేజెస్. ఈ రెండు ఫోటోలలో వారు వేసుకున్న డ్రెస్ కలర్ కాంబినేషన్ ఒకటే. గ్రీన్ ఇంకా రెడ్.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా ఆలియా భట్ వేసుకున్న కాస్ట్యూమ్ కలర్ ఇదే కాంబినేషన్ లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు పిరియాడిక్ సినిమాలు. అప్పట్లో కొన్ని రకాల కలర్స్ మాత్రమే ఎక్కువగా వాడేవారు.
ఇంకా ఇప్పుడు ఉన్నన్ని షేడ్స్ కూడా అప్పుడు అందుబాటులో ఉండేవి కాదు. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ కలర్ కోఇన్సిడెన్స్ అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
End of Article