బేకరీకి ఆ బోర్డు పెట్టారు…చివరికి అరెస్ట్ అయ్యారు.! అసలేమైందో తెలుసా?

బేకరీకి ఆ బోర్డు పెట్టారు…చివరికి అరెస్ట్ అయ్యారు.! అసలేమైందో తెలుసా?

by Anudeep

ప్రస్తుతం యావత్ భారత దేశం..కరోనా వైరస్ తో పోరాడుతుంది.మిగితా దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కరోనా భారత దేశంలో మొదలైనప్పుడు దాని తీవ్రత ఎలా ఉందొ..ఢిల్లీ లోని తబ్లీగీ జమాత్ ఘటన తరువాత కేసుల తీవ్రత ఎలా ఉందొ తెలిసిందే..ఒక్కసారిగా ఉలిక్కి పడిన యావత్ భారత దేశం…అటు తరవాత అదే పనిగా కొందరు ముస్లిం ల వద్ద కొనద్దు..లేదా వారిని దుకాణాల్లో పని చేయనీయవద్దు అంటూ ప్రచారాలు చేసారు.అది ఆలా ఉండగా చెన్నై లోని టి.నగర్ లోని చెన్నై మహాలక్ష్మి వీధిలో ఉన్న జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో ఈ బేకరీ యజమాని.”ముస్లిం సిబ్బంది లేరు” (నో ముస్లిం స్టాఫ్) అంటూ ప్రకటన చేసాడు..

Video Advertisement

ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారి..పోలీసుల వద్దకి చేరింది.అసలు విషయం తెలుసుకున్న పోలీసులు “జైన్ బేకరీస్ & మిఠాయిల” యజమాని సెక్షన్ 295 ఎ (ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలు, ఏ మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన భావాలను ఆగ్రహించటానికి ఉద్దేశించినది) మరియు ఐపిసి యొక్క సెక్షన్ 504 ( ఉద్దేశ్యంతోను ఉద్దేశపూర్వకంగా అవమానించటం ) కింద బుక్ చేసారు. ఈ ప్రకటన గురించి బేకరీ సిబ్బంది ని ప్రశ్నించగా ‘ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని..ముస్లింలు తయారుచేసిన బేకరీ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతూ వాట్సాప్‌లో వార్తలు వస్తున్నాయని , అందువల్ల వారు ఆలా చేయవలసి వచ్చిందని తెలిపారు.అంతే కాదు దుకాణం లో ఎవరైనా ముస్లిం సిబ్బంది పని చేస్తున్నారా ? అంటూ కస్టమర్ల వద్ద నుంచే ఫోన్ కాల్స్ వచ్చేవి అని కూడా అన్నారు.


You may also like

Leave a Comment