కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’సినిమా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని సాధించింది. కుటుంబ సభ్యుల్లో ఉండే అనుబంధాలు, ప్రేమానురాగాలు దూరమైతే వారు ఎలా ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో ఇంటి పెద్ద మరణిస్తే, వారంతా ఎలా స్పందిస్తారు. కాకి ముట్టకపోతే వారు ఏం చేశారనే కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
Video Advertisement
ఈ మూవీ థియేటర్ లలో ఉండగానే ఓటీటీలో విడుదలైన కూడా ఆడియెన్స్ థియేటర్ కి వెళ్ళి చూస్తున్నారు. ఊరంతా ఒక్క చోట చేరి కలిసి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. అంతలా ఈ చిత్రం ఆడియెన్స్ మనసుని తాకింది. సినిమాను చూసి చెమ్మగిల్లని కళ్లు ఉండవని చెప్పవచ్చు. ఈచిత్రంలోని నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. ఈ మూవీలో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి,రూప లక్ష్మి, నర్సింహ, మురళీధర్‌లకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ మూవీలో ‘లచ్చవ్వ’ పాత్రను చూసి కంటతడి పెట్టని వారు లేరని చెప్పవచ్చు. లచ్చవ్వ ఏడుస్తూ మూవీ చూసిన అందర్నీ ఏడిపించేసింది. ఈ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయి నటించిన నటి పేరు రూపలక్ష్మి. హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి బుల్లితెర పై సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ‘బలగం’చిత్రంతో వెండితెర పై కూడా గుర్తింపు తెచ్చుకుంది.
రూపలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయనకు ఆరుగురు సంతానం అని, తనను ఒక లెక్చరర్‌కి దత్తతగా ఇచ్చారని తెలిపారు. అయితే తాను ఇప్పటికకి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని చెప్పారు.అయితే సినిమాలో లచ్చవ్వ పాత్రలో గ్రామీణ మహిళగా కనిపించిన రూపలక్ష్మి నిజ జీవితంలో స్టైలిష్ లుక్‌లో కూడా ఉంటారు.అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారంట. బలగం మూవీతో క్రేజ్ తెచ్చుకున్న రూపలక్ష్మి తన స్టైలిష్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1. 2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
Also Read: బలగం “ఐలయ్య” నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలుసా..? “కుక్కకి ఉన్న మర్యాద కూడా నాకు లేదా..?” అంటూ..?