బలగం చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్రంలో నటించిన యాక్టర్స్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మూవీ సంబంధించిన విషయాలతో పాటుగా, తమ కెరీర్ లో ఎదురయిన విషయాలను కూడా తెలియచేస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో ఇంటిపెద్ద కొమురయ్య పేద్ద కొడుకు ఐలయ్య క్యారెక్టర్ లో కోటా జయరాం నటించారు. ఈ కథలో ఐలయ్య పాత్ర చాలా ముఖ్యమైనది. ఐలయ్య పాత్రను జయరాం చాలా సహజంగా నటించి ఆకట్టుకున్నారు. సినిమా చివరి సన్నివేశాలలో అందరిని ఏడిపించేశారు. బలగం సినిమా హిట్ అయిన క్రమంలో కోట జయరాం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఎక్కువగా ఈటీవీలో నడిచిందని తెలిపారు.
Balagam-Fame-Jayaram-commentsదూరదర్శన్ ఛానెల్ లో చిన్నచిన్న పాత్రలలో నటించానని ఆయన తెలిపారు. విజయ్ యాదవ్ తనకు ఎక్కువగా  అవకాశాలు ఇప్పించారని చెప్పారు. తనది 86 వ బ్యాచ్ అని, అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేదని అన్నారు. చేశారు. తన జీవితంలో ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్స్ చాలా జరిగాయని కోట జయరాం వెల్లడించారు. సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులని అన్నారు.balagam-movie-watched-the-entire-village-people2ఒక మూవీ షూటింగ్ సమయంలో నేను బాగా నటిస్తుండడంతో జయరాం పై ఫోకస్ చేస్తానని కెమెరామేన్ చెప్తే, దానికి కో డైరెక్టర్, ఆయన పై ఎందుకు పక్కనే ఉన్న కుక్క పై పెట్టు అన్నాడట. అతను అన్న ఆ మాటకు చాలా బాధ కలిగిందని, కుక్కకు ఉన్న మర్యాద ఆర్టిస్ట్ కి లేదా అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. కోట జయరాం ఇండస్ట్రీలో తనకు జరిగిన అవమానాల గురించి చెప్పిన విషయలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balagam-Fame-Jayaram-comments-1నిజానికి బలగం చిత్రంలో ఐలయ్య పాత్రను తన స్నేహితుడు చేయాల్సిందట. అతను చేయనని చెప్పడంతో ఆపాత్ర జయరాం దగ్గరకు వచ్చిందట. డైరెక్టర్ వేణు కోట జయరాంని ఆడిషన్ చేసిన, 3 నెలల తరువాత బలగం సినిమాలో ఎంపిక అయినట్లు తెలిపారు. అలా బలగం సినిమాలో తనకు అవకాశం వచ్చిందని జయరాం వెల్లడించారు.

watch video :

Also Read : ”శాకుంత‌లం” ప్రీమియ‌ర్‌ షో రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?