సమంత లీడ్ రోల్ లో నటించిన ‘శాకుంతలం’ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోలు వేయడం ప్రారంభించారు. అయితే ఈ మూవీ టాక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

ఇటీవల కాలంలో ప్రీమియర్ ట్రెండ్ టాలీవుడ్ లో పెరిగిపోయింది. రంగమార్తాండ, బలగం సినిమాలకు ఇలానే పెయిడ్ ప్రీమియర్స్ షోలు వేశారు. అదే దారిలో తాజాగా ‘శాకుంతలం’ సినిమాని కూడా ప్రదర్శించారు. దీంతో ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. సమంత నాచురల్ గా నటించిందని మరియు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని చెప్తున్నారు. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగుందని టాక్. గర్భంతో ఉన్నపుడు శకుంతల బాధపడే సన్నివేశాలు, ఆమె కష్టాలు ఈ చిత్రంలో హైలైట్ సీన్స్ అని అంటున్నారు.

shankuntalam-first-talk సమంత, దేవ్ మోహన్ నటనని మెచ్చుకుంటున్నారు. 3D ఎఫెక్ట్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటన ఆకట్టుకుందని అంటున్నారు. మొదటిసారి కెమెరా నటించినప్పటికి ఎలాంటి భయం లేకుండా బాగా నటించిందని, అర్హ కనిపించేది కాసేపయినా తన నటనతో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం బాగుందని అంటున్నారు. అయితే కొందరు ‘శాకుంతలం’ బాగుందని చెప్తుంటే, కొందరు బాగోలేదని చెబుతున్నారు.
shankuntalam-first-talk1కొందరు ఈ మూవీ యావరేజ్ అని అంటున్నారు. కొందరు రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టించాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికి  ఎవరికీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. కాగా ప్రీమియర్స్ తో మూవీ అసలు టాక్ ను అంచనా వేయలేమని చెబుతున్నారు.

Also Read: “సమంత” కి అభిమాని ఎమోషనల్ లెటర్..! “నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను..!” అంటూ..?