“సమంత” కి అభిమాని ఎమోషనల్ లెటర్..! “నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను..!” అంటూ..?

“సమంత” కి అభిమాని ఎమోషనల్ లెటర్..! “నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను..!” అంటూ..?

by kavitha

Ads

స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఆమె ఫ్యామిలీ మ్యాన్, పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింతగా పెరిగింది.

Video Advertisement

తాజాగా సమంత లీడ్ రోల్ లో నటించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.  దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే విడుదల అయిన  పాటలు, ట్రైలర్ అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపద్యంలో సమంత అభిమాని ఒకరు ట్విట్టర్ లో సమంతకు లెటర్ ను రాశారు. దానికి హీరోయిన్ సమంత రిప్లై కూడా ఇవ్వడం విశేషం. ఆ అభిమాని లెటర్ లో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం..
”మౌనంగా నిలబడినప్పటికి  మీ కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు మీ మనసుకు అద్దం లాంటిది. అవి ఏం చెప్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాటికి ఒక వ్యక్తిత్వం ఉంది. మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో ఉంటుంది. మీరు ఎప్పుడు తెరపై కనిపించినా నేను మీ కళ్ళనే చూస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ కళ్ళే చెప్తాయి. శకుంతలని మీ కళ్ళు చాలా అర్థం చేసుకున్నాయి. శకుంతలగా మీ అమాయకత్వం, మీ జాలి నాకు ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని కాపాడాలనే ధైర్యాన్ని ఇచ్చాయి.

fan emotional letter to samantha

ఇలాగే మీరు మీ వృత్తి ద్వారా మా అందరిని ఆలోచించేలా చేయాలనుకున్నారో ఏమో. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను ఎప్పటికీ అదే చెప్తాను. మీరే నా హీరో. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను మీరు నవ్వితే నేను నవ్వుతాను మిమ్మల్ని ఏదైతే బాధపెడుతుందో, నన్ను కూడా అది బాధ పెడుతుంది. దుష్యంతుడు యుద్ధానికి వెళ్తూ మిమ్మల్ని వదిలేసి వెళ్తుంటే మీరు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నాకు మీ దగ్గరికి వచ్చి మీ కన్నీరు తుడిచి బాధపడవద్దు అంతా సంతోషంగానే ఉంటుందని చెప్పాలని అనిపించింది.
మీరు ఏడుస్తున్నప్పుడు చాలా బాధగా కనిపిస్తారు. అలా చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి అది ఒక సీన్, మీరు ఒక నటి అనే విషయం గుర్తుకి రాదు. బహుశా ఇందుకు కారణం మన మధ్య ఉన్న బంధం ఏమో. మేము మీ సంతోషం గురించి ప్రార్థించే అంత దగ్గర అయ్యాము. మీరు మా కుటుంబమే సామ్.

తల్లిని ప్రేమించడం, అభిమానించడం, రక్షించడం తప్ప మరేమీ తెలియని ఒక అమ్మాయి లాగే నేనూ ఉన్నాను. మీరు మీలాగా ఉన్నందుకు థాంక్యూ. ఏదేమైనా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మీరు మమ్మల్ని ఎంతో దగ్గర వారిగా  భావించారు. అందుకే మీరు ఫాన్స్ ని మీలాగా ఎవరు నన్ను ప్రేమించగలరని అడిగారు.
samantha reply to fan letter

నిజంగానే అభిమానులు మిమ్మల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు. మిమ్మల్ని ఎప్పటికీ మా గుండెల్లో పెట్టుకుంటాము. అక్కడ మీరు సురక్షితంగా ఉంటారు” అని రాశారు. సమంత ఈ లెటర్ కి సమాధానంగా ”ఈ లెటరే నా విజయం” అని ట్వీట్ చేసింది.

Also Read: “క్షణం కూడా నిన్ను మర్చిపోలేను..!” అంటూ… “తారకరత్న” భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!


End of Article

You may also like