నందమూరి తారకరత్న కన్నుమూసి 2 నెలల గడుస్తున్నప్పటికి  ఆయన ఫ్యాన్స్ తారకరత్న మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్తను తలుచుకుంటూనే బ్రతుకుతోంది. ఆ బాధ నుండి  కొలుకోలేకపోతున్నారు.

Video Advertisement

ఎంతగానో ప్రేమించి, వివాహం చేసుకున్న భర్త తనను అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోవడంతో అలేఖ్య తారకరత్న లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో తారకరత్న గురించి ఇప్పటివరకు చాలా ఎమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ మరో వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
alekhya-reddy-shares-emotional-videoతారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఆనందంగా ఉంటున్న సమయంలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అలేఖ్యను ఎంతగానో కృంగదీసింది. ఎంతగా అంటే తారకరత్న మరణించి 2 నెలలు అవుతున్నప్పటికి  అలేఖ్య ఇంకా భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తారకరత్న పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలేఖ్య రెడ్డి నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం అయినా ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు అలేఖ్య రెడ్డి ఈ బాధ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
alekhya-reddy-shares-emotional-video2 ఇక నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొదలైన కాసేపటికే  తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పటల్ లో చేర్చారు. ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 18న  తుదిశ్వాస విడిచారు.

Also Read: “ఈ కష్టాల వల్ల ఇలా మారిపోయాను..!” అంటూ సమంత కామెంట్స్..! ఏం అన్నారంటే..?