స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ఈ మూవీ ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఈ నేపద్యంలోనే సమంత ఇటీవల మీడియాతో ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు.
Video Advertisement
శాకుంతలం స్టోరిని గుణ శేఖర్‌గారు చెప్పినపుడు సర్‌ప్రైజ్ అయ్యాను. ఎంతోమంది ఇష్టపడే శకుంతల పాత్రను చేయడం పెద్ద బాధ్యతగా అనిపించింది. దాంతో భయపడి మొదట గుణ శేఖర్‌గారు అడిగినపుడు నో చెప్పాను. అప్పుడే ఫ్యామిలిమెన్ లో రాజీ పాత్రను చేశాను. అయితే శకుంతల క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నమైన పాత్ర. ఈ పాత్రలో ఎంతో అందంగా, గౌరవంగా కనిపించాల్సి ఉంటుంది. శాకుంతల పాత్రకి న్యాయం చేశానని అనుకుంటున్నానని తెలిపారు.
ఈ క్రమంలో మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు సంతోషంగా అమాయకంగా కనిపించే హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారింది అని మీడియా అడిగింది. సమంత మాట్లాడుతూ ఒకప్పుడు నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు. దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక అదే స్క్రీన్ పైన కనిపించేది. కానీ నా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా కూడా తమ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్ట్రాంగ్ గా అవుతారు.
అలా నేను కూడా మారాను, అందుకు నేనేమీ ప్రత్యేకం కాదు. నా లైఫ్ లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. వాటివల్ల నా లైఫ్ నాశనం కాకూడదని, దానికి తగినట్లుగా మారి ముందుకు వెళ్తున్నానని చెప్పారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మధు బాల, అల్లు అర్హ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించగా, నిలిమా గుణ నిర్మిస్తున్నారు.
watch video :
You are very very special for many reasons Sam @Samanthaprabhu2🤍 #ShaakuntalamOnApril14 #ShaakuntalamIn3D #SamanthaRuthPrabhu pic.twitter.com/twGzN3c3sC
— Sravanthi CM (@Sravanthi_sam) April 10, 2023