Ads
మనిషి జీవితంలో సినిమా కూడా భాగంగా మారిందని అనుకునేవారు చాలా మంది. ఇక అందులో తెలుగు ప్రజలను, తెలుగు సినిమాలను విడిగా చూడలేరు. ఒకప్పుడు అయితే థియేటర్లకు ఎడ్లబండ్లలో, ట్రాక్టర్లు, ఆ తరువాత ఆటోల్లో వెళ్ళేవారు. ఊరి వారందరు కలిసి ప్రొజెక్టర్లలో సినిమాలు చూడడం గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది. అయితే మారుతున్న కాలంలో అది కనుమరుగు అయ్యింది.
Video Advertisement
ఇప్పుడున్న జీవితంలో అంత టైమ్ ఎవరికి ఉండట్లేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలసి మూవీ చూసే తీరికే లేని జీవితాలుగా మారిపోయాయి. అయితే ఇటీవల విడుదల అయిన ఒక చిత్రం అందరినీ కలుపుతోంది. ఎంతలా అంటే ఊరు జనాలంతా కలిసి బస్సులు కట్టుకొని థియేటర్‌కి వచ్చేలా చేసింది ఆ మూవీ. ఇప్పుడు ఊరంతా ఒక్క చోట చేరి మూవీ చూసేలా కూడా చేసింది. ఆ చిత్రమే బలగం.
అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం మూవీ సంచలనం సృష్టించింది. హాస్య నటుడు వేణు మొదటిసారిగా దర్శకత్వం చేసిన బలగం చిత్రం ప్రేక్షకుల హృదయాలలో స్థానం పొందింది. మనుషుల మధ్య సంబంధాలను మనసులకు హత్తుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే అనురాగాలు, ప్రేమలు, కోపాలు, పగలు, వంటి అన్ని ఎమోషన్స్‌ను డైరెక్టర్ వేణు అద్భుతంగా చూపించారు. ఈ కథ ఆడియెన్స్ కి కంటతడి పెట్టిస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకి రప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఊరంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఒక వీడియోను బలగం సిననిమా దర్శకుడు వేణు పంచుకున్నారు. ఓ ఊరిలోని వారంత గుడి దగ్గర ఉన్నప్రదేశంలో కూర్చొని బలగం సినిమాని చూశారు. చిన్న,పెద్దా అందరూ కూడా ఈ చిత్రాన్ని చూశారు.
ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వేణు ఎక్కడో తెలియదు. నిన్న రాత్రి ఊరంతా కలిసి బలగం మూవీ చూశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా చూసినవారు ఈ సినిమాను థియేటర్లో చూడాలని థియేటర్లకు వెళ్తున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అది ఏ గ్రామం అని ఆరా తీస్తున్నారు.Also Read: రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ సినిమాను మిస్ చేసుకున్న నటీనటులు వీరే..!
https://www.instagram.com/p/CqcALhfJYFc/
పాత రోజులను గుర్తు చేస్తున్న బలగం సినిమా
నిజామాబాద్ జిల్లా హసకోత్తుర్ గ్రామ ప్రజలు మొత్తం ఒక్క చోట చేరి బలగం సినిమా చూస్తున్న గ్రామస్తులు
చిన్ననాటి రోజులు గుర్తు చేస్తూ గ్రామ పంచాయతీల ముందు పెద్ద తెరలు ఏర్పాటు చేసుకుని బలగం చూస్తున్నారు#Balagam #Balagamonprime pic.twitter.com/dU1iqAjsIO
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2023
End of Article