Ads
టాలీవుడ్ హీరో బాలయ్య అంటే ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్. ఇప్పుడంతా ‘జై బాలయ్య’ ట్రెండ్ నడుస్తోంది. హీరో ఎవరైనా సందర్భం ఏదైనా సరే అక్కడ ”జై బాలయ్య” స్లోగన్ కచ్చితంగా వినపడుతూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తేనే ఆయన క్రేజ్ ఏంటో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అలాగే బాలకృష్ణ కూడా తన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక పెళ్లి కొడుకు తన పెళ్లికి బాలయ్య కచ్చితంగా రావాలని బాలయ్య వస్తే మాత్రమే తాళిబొట్టు కడతానని మొండి పట్టు పట్టారు.
Video Advertisement
విశాఖ జిల్లాలోని చింతల అగ్రారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలయ్యకు, నందమూరి ఫ్యామిలీ కి వీరాభిమాని అయిన పెద్దినాయుడు కి పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కార్డు పై సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఫోటోలతో పెద్దినాయుడు డిజైన్ చేయించారు. మార్చి 11వ తేదిన వివాహం జరగనుంది. ఆరు పేజీలతో కూడిన ఆ వివాహ ఆహ్వాన పత్రికపై తన అభిమాన హీరోల ఫోటోలు ముద్రించి అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే తన పెళ్ళికి బాలయ్య వచ్చేలా చూడాలని తెలిసిన వారిని కోరుతున్నాడట ఈ యువకుడు.
తనకు, తన కుటుంబానికి సీనియర్ ఎన్టీఆర్ దేవుడని, తమ ఇంటి పూజ గదిలో ఆయన ఫోటోలే కనిపిస్తాయని ఆ వరుడు అంటున్నాడు. ఎన్టీఆర్ నే కాకుండా ఆయన కుటుంబీకులను కూడా తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నట్లు తెలిపాడు. తన జీవితంలో ఎంతో కీలక ఘట్టమైన పెళ్లిలో కూడా వారికి విశేష స్థానం ఉంటుందని, అందుకే బాలయ్య వస్తేనే తాను తాళికడతానని అంటున్నాడు. బాలయ్యకు తెలిసినవారిని కలిసి పెళ్లి సమాచారాన్ని చెప్పాలని, అలాగే ఆయన పెళ్లికి వచ్చేలా చేయాలని పెద్దినాయుడు ఎంతో ఆశపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా బాలయ్య పెళ్లికి రావాలని ఆశిస్తున్నారు.
అయితే నందమూరి తారకరత్న మరణంతో ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధలో ఉంది. ఇలాంటి సమయంలో బాలయ్య శుభకార్యాలకు హాజరు కావడానికి ఇష్టపడరు. మరి ఇటువంటి సమయం లో ఈ అభిమాని కోరిక నెరవేరుతుందో లేదో అని అందరు చర్చించుకుంటున్నారు. పెళ్లి ఆహ్వానం అందుకున్న అతిథులు సైతం ఎంతో ఆసక్తితో పెళ్లిపత్రికను తిలకిస్తున్నారు. మొత్తానికి ఈ పెళ్లికొడుకు కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
End of Article