ఇందుకే కదా “బాలయ్య” ని బంగారం అనేది..? మొదటి యాడ్ డబ్బులని బాలకృష్ణ ఏం చేసారో తెలుసా..?

ఇందుకే కదా “బాలయ్య” ని బంగారం అనేది..? మొదటి యాడ్ డబ్బులని బాలకృష్ణ ఏం చేసారో తెలుసా..?

by Megha Varna

Ads

ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.

Video Advertisement

ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.

1 balayya

ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యిపోయింది. అలానే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందిట. ఎమోషన్స్ కూడా ఎక్కువ వుంటాయని టాక్. అలానే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండనుంది. వర లక్ష్మి శరత్ కుమార్ బాలయ్య సోదరిగా నటించనుంది. బాల కృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో NBK 108 రానుంది.

తాజాగా బాలయ్య బాబు ఒక యాడ్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ఎప్పుడు కూడా యాడ్స్ చెయ్యలేదు. ఇదే మొదటి యాడ్. ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాడ్‌లో బాలయ్య చేసారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ కూడా అయ్యింది. ఈ యాడ్ కి బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ యాడ్ కి బాలయ్య 15 కోట్ల రూపాయలు తీసుకున్నారని అంతా అంటున్నారు. అయితే ఈ డబ్బులను బాలయ్య బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి కి ఇచ్చేసారు. బాలయ్య చేసిన మంచి పని చూసి అంతా అభినందిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే మా బాలయ్య అంటే అంతే మరి అని అంటున్నారు.


End of Article

You may also like