Ads
నందమూరి బాలకృష్ణ ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చరిత్ర ఆత్మకు చిత్రాలు చేయడానికి ఇష్టపడుతుంటారు.తెలుగు చిత్రసీమలో సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సైన్స్‌ఫిక్షన్, భక్తిరసాత్మకం..ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే.
Video Advertisement
ఆరేళ్లక్రితం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించారాయన. ప్రయోగాల చేయాలన్నా కూడా బాలయ్య పేరే గట్టిగా వినిపిస్తుంది. పౌరాణిక డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య.
త్వరలో బాలయ్య మరో హిస్టారికల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఓ మహారాజు కథతో ఈ సినిమా రూపొందనున్నట్టు వినికిడి. ప్రస్తుతం ఆయన కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బోయపాటి శీను డైరెక్షన్ లో అఖండ2 సినిమాని చేయనున్నారు.
అయితే ఈ చరిత్ర ఆత్మకు చిత్రాన్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఇంతకీ తెలుగు నేలను పాలించిన ఆ మహారాజు ఎవరు?అనే పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి. బాలకృష్ణను మరోసారి అటువంటి పాత్రలో చూసేందుకు ఆయన ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు
End of Article