Home Filmy Adda “బాలకృష్ణ” నటిస్తానంటే… “ఎన్టీఆర్” వద్దు అన్న ఆ సూపర్ హిట్ సినిమా ఎదో తెలుసా..?

“బాలకృష్ణ” నటిస్తానంటే… “ఎన్టీఆర్” వద్దు అన్న ఆ సూపర్ హిట్ సినిమా ఎదో తెలుసా..?

by Anudeep

1997 లో నందమూరి తారక రామారావు గారు తాతినేని రామారావు గారి దర్శకత్వం లో నటించిన చిత్రం యమగోల. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా, కైకాల సత్యనారాయణ గారు యముడిగా నటించారు. యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. కానీ వీటన్నింటికి ట్రెండ్ సెట్టర్ మాత్రం ‘యమగోల’. కెమెరామెన్ వెంకటరత్నం నిర్మాతగా.. డీవీ నరసరాజు కథను అందించారు.

 

అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ చేయాల్సి వుండగా.. యముడిగా ఎన్టీఆర్ నటించాల్సింది. ప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవాంతకుడు’లో ఆయన యముడిగా నటించి వున్నారు. దీంతో బాలయ్య హీరోగా ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నారు.

balakrishna should acted in yamagola movie..
కానీ ఇది అన్నగారికి నచ్చలేదు. బాలయ్య సొంత బ్యానర్ లో తప్పించి వేరే బ్యానర్ లలో సినిమాలు చేయడం రామారావుకు నచ్చదు. దీంతో బాలకృష్ణ ఇంకా చదువుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఆయన్ను తప్పించి.. తానే హీరోగా నటించాలని అనుకున్నారు. అంతేకాకుండా తాను చేయాల్సిన యముడి పాత్రకు కైకాల సత్యనారాయణను రికమెండ్ చేశారు.

balakrishna should acted in yamagola movie..

అలా డివైన్ కామెడీతో వచ్చిన యమగోల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ యమ గోల చిత్రం లో బాలకృష్ణ నటించేందుకు అన్నగారు ఒప్పుకొని ఉంటే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన కాంబినేషన్ చూసే అవకాశం దక్కేది.

You may also like