బాలకృష్ణ కొడుకు “మోక్షజ్ఞ” కొత్త లుక్ ఫోటో చూశారా..? ఎంత మారిపోయాడో కదా..?

బాలకృష్ణ కొడుకు “మోక్షజ్ఞ” కొత్త లుక్ ఫోటో చూశారా..? ఎంత మారిపోయాడో కదా..?

by kavitha

Ads

నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుని, టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. బాలయ్యకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

బాలకృష్ణ వారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బొద్దుగా ఉండే మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతారా అనే సందేహాలు ఉండేవి. కానీ మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజెన్లు ఎంత మారిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఎప్పుడూ చూద్దాం..
mokshagna-2నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ  హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్  చేశారు. mokshagnaఅయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ  ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.

Also Read: లావణ్య పెళ్లి విషయంలో అప్పుడు “అల్లు అరవింద్” చెప్పింది నిజమైందిగా.? ఎవరో ఒకరిని అంటే మెగా ఫ్యామిలీలోనే చూసుకుందిగా.!


End of Article

You may also like