హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక శుక్రవారం రాత్రి మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Video Advertisement

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి పై చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై  నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. వీరిద్దరు ఐదేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. వరుణ్, లావణ్య  2017లో మిస్టర్ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. గత రెండు సంవత్సరాల నుండి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే  2 రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్‌ గురించి అఫిషియల్ గా ప్రకటించారు.
మణికొండలోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరుగింది. శుక్రవారం (జూన్ 9) సాయంత్రం వరుణ్-లావణ్య ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబం మొత్తం అందరు  హాజరయ్యారు. ఇదిలా ఉంటే గతంలో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడిన మాటలు ఎంగేజ్‌మెంట్‌ తరువాత వైరల్ అయ్యాయి. లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో లావణ్య తెలుగులో మాట్లాడం చూసిన అల్లు అరవింద్, “ఈ అమ్మాయి ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఒక కుర్రాడిని చూసి పెళ్లిచేసుకుంటే బాగుంటుంది కదా” అన్నారు. ఆ వీడియో చూసినా నెటిజెన్లు అల్లు అరవింద్ చెప్పిందే నిజం ఏయినడాని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఎవరో ఒకర్ని అంటే మెగా ఫ్యామిలీలోనే చూసుకుందిగా అంటున్నారు.

Also Read: “అఖండ” తో పాటు… బాలకృష్ణ “డ్యూయల్ రోల్” లో నటించిన 10 సినిమాలు..!