సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.

movies in which balakrishna acted in dual roles

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు. అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. బాలకృష్ణ అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 అపూర్వ సహోదరులు

1986లో వచ్చిన అపూర్వ సహోదరులు అనే సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు.

movies in which balakrishna acted in dual roles

#2 రాముడు భీముడు

రాముడు భీముడు సినిమాలో బాలకృష్ణ రాముడిగా, భీముడిగా నటించారు.

movies in which balakrishna acted in dual roles

#3 చెన్నకేశవ రెడ్డి

చెన్నకేశవరెడ్డి సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించారు బాలకృష్ణ.

movies in which balakrishna acted in dual roles

#4 ఆదిత్య 369

ఈ సినిమాలో కృష్ణ కుమార్ గా, శ్రీకృష్ణ రాయలుగా నటించారు.

movies in which balakrishna acted in dual roles

#5 సుల్తాన్

ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా, అలాగే కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

movies in which balakrishna acted in dual roles

#6 అఖండ

ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన అఖండ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు.

Akhanda movie trolls

#7 అల్లరి పిడుగు

అల్లరి పిడుగు సినిమాలో కూడా రెండు పాత్రలు పోషించారు బాలకృష్ణ.

movies in which balakrishna acted in dual roles

#8 సింహా

సింహాలో కూడా తండ్రిగా, కొడుకుగా నటించారు.

movies in which balakrishna acted in dual roles

#9 పెద్దన్నయ్య

ఈ సినిమాలో బాలకృష్ణ అన్నగా, తమ్ముడిగా నటించారు.

movies in which balakrishna acted in dual roles

#10 లెజెండ్

లెజెండ్ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు.

movies in which balakrishna acted in dual roles

వీటితో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో, అలాగే కొన్ని సినిమాలో ట్రిపుల్ రోల్ లో కూడా నటించారు.