Ads
జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు పరిచయం అయి 24 ఏళ్లు.. అప్పుడే అన్నేళ్లు గడిచిపోయిందా అనుకుంటున్నారా? నిజానికి ఎన్టీఆర్ ఇండస్ట్రీకి పరిచయం అయింది బాలరామాయణం సినిమాలో బాలనటుడిగా..తర్వాత ఆరేళ్లకు స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరోగా నటించారు. 1996లో వచ్చిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎంఎస్ రెడ్డి ఈ కాలం పిల్లలందరికి రామాయణాన్ని పరిచయం చేయాలని తీశారు. ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్.
Video Advertisement
రాముడు : ఆ చిత్రంలో నటించిన మన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పెద్ద స్టార్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఇరవై నాలుగేళ్ల కాలంలో ఎన్టీఆర్ 29 సినిమాలు చేశారు. పెళ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు. మరి మిగతా బాలనటులు ఎలా ఉన్నారు..తెలుసుకోవాలనుందా.. మరికెందుకాలస్యం ..
సీత : పెద్దపెద్ద కళ్లతో సీతగా అందరి మనసు దోచుకున్నారు స్మితా మాధవ్. ప్రస్తుతం భరతనాట్యకారిణిగా స్థిరపడ్డారు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు..ఇప్పుడు మరికొంతమందికి నృత్యాన్ని నేర్పిస్తున్నారు.
లక్ష్మణుడిగా నారాయణమ్ నిఖిల్ నటించారు.
హనుమంతుడి పాత్రలో అర్జున్ గంగాధర్ నటించారు.
రావణుడు :రావణుడిగా నటించినది బాలనటుడు కాదు..బాల నటి పేరు స్వాతి బాలినేని..ప్రస్తుతం గృహిణిగా స్థిరపడ్డారు.
మండోదరి : రావణాసురి భార్య మండోదరిగా నటించింది శ్వేత . ప్రస్తుతం అమెజాన్ లో వర్క్ చేస్తున్న శ్వేత కి పెళ్లి అయింది ఒక బాబు కూడా ఉన్నాడు .. గృహిణిగా, ఉద్యోగినిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
శబరి : శబరిగా నటించింది మనందరికి పరిచయం ఉన్న నటి సునైన. అమ్మోరు చిత్రంలో బాలనటిగా నటించిన సునైనా తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు.ఇటీవల ఫ్రస్టేటెడ్ ఉమన్ గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు.అంతేకాదు ఓ బేబిలో రాజేంద్రప్రసాద్ కూతురుగా నటించింది బాలరామయణంలోని శబరే..
కుంభ కర్ణుడు : కుంభ కర్ణుడుగా నటించింది అమ్జాద్ ఖాన్. ప్రస్తుతం కమెడియన్ గా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
మల్లెమాల వారు కండక్ట్ చేసిన యాక్టింగ్ క్లాసెస్ లో,షూటింగ్ స్పాట్లో ఆడుతు పాడుతూ పెరిగిన ఈ చిన్నారులు ఇప్పుడు ఇదిగో ఇలా సెటిల్ అయ్యారు..
Watch Bala Ramayanam Full-Length Movie::
End of Article