Ads
బాలకృష్ణకి అఖండ చిత్రం మంచి హిట్ ని తీసుకు వచ్చిందని చెప్పాలి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర గర్జించింది. ఈ చిత్రం హిట్ అవడంతో అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.
Video Advertisement
తాజాగా ఒక అభిమాని బాలకృష్ణ కి ఫోన్ చేసి అతని యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇన్నాళ్లు ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చింది అని చెప్పాడు. అలానే బాలకృష్ణ తో ఫోన్ మాట్లాడిన ఆ అభిమాని మీ అభిమానులుగా పుట్టకపోతే మా పరిస్థితి ఏంటి అని కూడా అన్నాడట. పైగా చాలా రోజుల తర్వాత మళ్లీ థియేటర్లో జనం, ఆ హంగామా, ఎక్కడ చూసిన అఖండ గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అభిమాని బాలకృష్ణ తో చెప్పాడు.
ఇన్నాళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అభిమానులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అన్నయ్య అంటూ ఆనందంగా చెప్పాడు. నీలో భగవంతుడు ఉన్నాడు అన్నయ్య అని కూడా అభిమాని చెప్పగా.. బాలయ్య నాకు భగవంతుడు నాన్నగారు, ప్రజలు, అభిమానులు, దేవాలయం అని చెప్పారు. అలానే కార్తీకమాసంలో నీలో శివుడిని చూసుకున్నాం అన్నయ్యా అంటూ అభిమాని బాలకృష్ణ తో ఎమోషనల్ గా మాట్లాడాడు.
End of Article