Akhanda: బాలయ్య కంటే.. అతన్నే ఫ్యాన్స్ ఎక్కువ పొగిడేస్తున్నారుగా.. ఎందుకంటే..?

Akhanda: బాలయ్య కంటే.. అతన్నే ఫ్యాన్స్ ఎక్కువ పొగిడేస్తున్నారుగా.. ఎందుకంటే..?

by Anudeep

Ads

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ పై బాగానే ఎలివేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య లీడ్ రోల్ చేస్తున్న ఏ సినిమా అయినా వన్ మాన్ షో అయిపోతుంది.

Video Advertisement

బాలయ్య అభిమానులు కూడా ఈ విషయమై ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. అయితే అఖండ విషయంలో మాత్రం అది వేరుగా ఉంది. బాలయ్య అభిమానులు తమన్ కి ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారు.

akhanda

దానికి కారణం తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. నిజంగానే ఆ సౌండ్ కి థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉంది. దీనితో.. USA లో సినిమార్క్ యాజమాన్యం.. థియేటర్ నిబంధనలను అనుసరించి సౌండ్ ను పరిమిత డెసిబుల్స్ వరకు మాత్రమే చూపిస్తామని, ప్రేక్షకులు సహకరించాలని కోరారు. దీనితో.. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఆ సీన్స్ కు అంత హైప్ వచ్చింది అంటూ తమన్ ని తెగ పొగిడేస్తున్నారు.


End of Article

You may also like