Ads
దీపావళి సందర్భంగా టాలివుడ్ హీరోలు అందరూ ఒకే చోట సరదాగా చేరారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సందర్భంగా మెగా వారు ఈ పార్టీని పోస్ట్ చేశారు. ఈ పార్టీలో ఎందరో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హంగామా చేశారు. నాగార్జున, అమల ,వెంకటేష్, మహేష్ బాబు ,నమ్రత ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ,అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఇలా ఎందరో సెలబ్రిటీల జంటలు ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఇంతమందిలో ఒక్కరు మాత్రం మిస్సయ్యారు.
Video Advertisement
సోషల్ మీడియాలో వీళ్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ,విక్టరీ వెంకటేష్ ,కింగ్ నాగార్జున ఈ ముగ్గురి కలిసి దిగిన ఫోటోలు బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో సై అంటే సై అంటూ సినిమాలు తీస్తూ మంచి స్టార్డం అనుభవిస్తున్న ఈ ముగ్గురు నటులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ ముగ్గురితో పాటు ఆ ఒక్క హీరో మిస్ అవ్వడం అభిమానులకు కూడా వెనుతిగా ఉంది.
ఆ హీరో ఎవరో కాదు నందమూరి అందగాడు బాలకృష్ణ. చిరంజీవి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి టాలీవుడ్ లో తన తోటి సినీ సెలబ్రిటీలను అందరిని పిలిచినా బాలయ్యకు మాత్రం ఎందుకో ఆహ్వానం ఉండదు. రీసెంట్గా టాలీవుడ్ లో 1980 బ్యాచ్ ఒకటి క్రియేట్ అయింది. వీళ్లు రెగ్యులర్గా ఎక్కడో ఒకచోట కలుస్తూ ఉంటారు కానీ ఈ గ్రూపులో బాలయ్య మాత్రం ఎప్పుడూ కనిపించడు.
గతంలో చిరంజీవి ఇంట్లో ఈ బ్యాచ్ మీట్ అయినప్పుడు తనను పిలవలేదని బాలయ్య ఒక సందర్భంలో ఓపెన్ గానే చెప్పారు.మరి ఇప్పుడు ఈ ఫంక్షన్ లో కూడా బాలయ్య లేకపోవడం వెనుక కారణం చిరంజీవి ఆహ్వానించకపోవడమే అన్న గుసగుసలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ బాలయ్యను ఇటువంటి ఫంక్షన్ కి పిలవకపోవడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
End of Article